AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ముంబైలోని ఈ 5 ప్రదేశాలు అద్భుతం..! తప్పకుండా వీక్షించండి..

Mumbai: దైనందిన జీవితంలో నిరంతర పని ఒత్తిడి వల్ల అలసట తప్పదు. నిత్యం రణగొన ధ్వనుల మధ్య బతికే పట్టణవాసులు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు.

Mumbai: ముంబైలోని ఈ 5 ప్రదేశాలు అద్భుతం..! తప్పకుండా వీక్షించండి..
Lonavala
uppula Raju
| Edited By: |

Updated on: Oct 04, 2021 | 6:32 AM

Share

Mumbai: దైనందిన జీవితంలో నిరంతర పని ఒత్తిడి వల్ల అలసట తప్పదు. నిత్యం రణగొన ధ్వనుల మధ్య బతికే పట్టణవాసులు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు. అటువంటి వారికి ముంబై చక్కటి ప్రదేశం. ఇక్కడి ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ఇక్కడికి వెళ్లిన వ్యక్తులు కచ్చితంగా చూడాల్సిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1. అలీబాగ్ ముంబైకి దగ్గరగా ఉన్న అలీబాగ్ ఎల్లప్పుడూ పర్యటకులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రదేశం బీచ్‌లకు ప్రసిద్ది. పర్యాటకులు బీచ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి, సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనడానికి, సమీపంలోని కొన్ని కోటలను అన్వేషించడానికి బాగుంటుంది.

2. లోనావాలా ఇక్కడ మీరు మైనపు మ్యూజియం, భూషి బంద్‌ను సందర్శించవచ్చు. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. అందుకనుగుణంగా ప్లాన్‌ చేసుకోవాలి.

3. ఎలిఫెంటా గుహలు ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాన్ని చేరుకోవడానికి మీరు గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి పడవ ప్రయాణం చేయాలి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన ఎలిఫెంటా గుహలు 5 నుంచి 7 శతాబ్దానికి చెందినవి. ఇక్కడ రాతితో చేసిన శిల్పాలు ఈ ప్రదేశానికి ప్రధాన ఆకర్షణ.

4. మాల్షేజ్ ఘాట్ పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ప్రశాంతమైన హిల్ స్టేషన్ పర్వతారోహకులు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది సరస్సులు, పర్వతాలు, అనేక జలపాతాలతో కనువిందు చేస్తుంది. సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి వాతావరణం దాదాపు ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

5. నాసిక్ నాసిక్ అద్భుతమైన పాండవ్లేని గుహలు, ద్రాక్షతోటలకు ప్రసిద్ధి చెందింది. మీరు ఏదైనా ద్రాక్షతోటలను సందర్శించవచ్చు. ద్రాక్షతో తయారుచేసిన వైన్ రుచి చూడవచ్చు.

6. వాసాయి మీరు విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబం, స్నేహితులతో గడపడానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. అనేక బాలీవుడ్ షూట్‌లు ఇక్కడ జరుగుతాయి. ఈ ప్రదేశంలో రాజోడి, కలాం, సురుచి బీచ్‌లు ఉన్నాయి. కొన్ని చర్చిలు, ఓపెన్ పార్కులు సందర్శించడానికి బాగుంటాయి.

Aryan Khan Drugs Case: ఆర్యన్ అరెస్ట్ తరువాత షారుఖ్‌ని కలవడానికి వెళ్లిన సల్మాన్‌ఖాన్‌..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్