Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: బ్రహ్మోత్సవాల్లో 13 జిల్లాల్లోని వారికి బంపర్ ఆఫర్.. ఉచిత బస్సులతో పాటు శ్రీవారి దర్శనం..

Tirumala Srivari Brahmotsavam Darshan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో..

Tirumala: బ్రహ్మోత్సవాల్లో 13 జిల్లాల్లోని వారికి బంపర్ ఆఫర్.. ఉచిత బస్సులతో పాటు శ్రీవారి దర్శనం..
Tirumala Brahmotsavam
Follow us
Surya Kala

|

Updated on: Oct 04, 2021 | 7:52 PM

Tirumala Srivari Brahmotsavam Darshan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌కు శ్రీ‌వారి స్పెషల్ దర్శ‌నం కల్పించనున్నారు. ఏపీలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక‌బ‌డిన వ‌ర్గాల శ్రీవారి భ‌క్తుల‌కు ఈ నెల  7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. టీటీడీ ఆలయాలు నిర్మించిన ప్రాంతాల్లోని వెనకబడిన వర్గాల ప్రజలకు శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కూడా టీటీడీ అధికారులు కల్పించనున్నారు. ఇలా దర్శనం చేసుకునే శ్రీవారి భక్తులకు ఉచిత రవాణా, భోజన, వసతి సౌకర్యాలను  టీటీడీ అధికారులు కల్పించనున్నారు.

హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేందుకు, మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌తో క‌లిసి స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో టిటిడి మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్ల‌తో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ ఆల‌యాలు నిర్మించిన వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుండి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయించ‌డం జ‌రుగుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 బ‌స్సులు ఏర్పాటుచేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం జ‌రుగుతుంది. తూర్పుగోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో 20 బ‌స్సులు ఏర్పాటు చేయ‌డ‌మైన‌ది. ఒక్కో బ‌స్సులో ఇద్ద‌రు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు స్థానిక దాతల స‌హ‌కారంతో భోజ‌నాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.

Also Read:

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. గత 6 రోజుల్లో ఆదాయం ఎంతో తెలుసా 

తండ్రి భారం అంటూ ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకు, కూతురు.. ఆదరించిన స్థానికులు ఎక్కడంటే..