Vishnu Temple in Goa: గోవాలో 18వ శతాబ్దంనాటి అతిపురాతన ఆలయం.. హిందువులకు మాత్రమే ప్రవేశం..
Lakshmi Narasimha Swamy Temple: దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే అందమైన సుందరమైన ప్రదేశము గోవా. అయితే గోవా అంటే చర్చి, సముద్ర తీరం అందమైన బీచ్ లు ఎక్కువగా..
Lakshmi Narasimha Swamy Temple: దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే అందమైన సుందరమైన ప్రదేశము గోవా. అయితే గోవా అంటే చర్చి, సముద్ర తీరం అందమైన బీచ్ లు ఎక్కువగా గుర్తుకు వస్తాయి. కానీ గోవాలో కూడా అత్యంత పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి లక్ష్మి నరసింహస్వామి దేవాలయం. గోవాలోని వెల్లింగ్ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలో భక్తుల తాకిడి కొంత తక్కువగానే ఉంటుంది. దేవాలయం ముందు ఉన్న సరస్సు ఎప్పటికీ ఎండిపోదని స్థానికులు కథనం.
సుందరమైన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం వెలింగ వద్ద ఉంది. ఇక్కడ విష్ణువు భార్య లక్ష్మీ దేవితో కొలువై ఉన్నారు. ఈ ఆలయం 18 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని దేవత 1567 లో సాల్సెట్ నుండి వేరొక ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది.
ఈ అలయంలో నరసింహస్వామి విష్ణువు యొక్క నాలుగవ అవతారం. ప్రధాన మందిరానికి వెళ్లే దారిలో శ్రీ లక్ష్మి నరసింహ ఆలయ హాలులో విష్ణువు యొక్క వివిధ అవతారాల చిత్రాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మి నరసింహ ఆలయ ప్రాంగణానికి చాలా చివరన ఒక అందమైన కోనేరు ఉంటుంది. దీని చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ కోనేరులోని నీరు ఎప్పటికీ ఎండిపోదని స్తానికుల కథనం. స్థానికులు తరచూ కోనేరులో స్నానం చేస్తారు. లక్ష్మీ నరసింహ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఫిబ్రవరి మధ్యలో మంగూరిష్ జాత్రా, శ్రీ రామనవమి , నవరాత్రి ఉన్నాయి. ఇక శ్రీ లక్ష్మి నరసింహ యొక్క పల్లకీ ఉత్సవం శుక్లా చతుర్దశిలో నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయంలోకి హిందూమతాన్ని విశ్వసించేవారికి హిందువులకు మాత్రమే అనుమతిని ఇస్తారు. కనుక ఎప్పుడు పరిమిత సంఖ్యలో భక్తులు ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది.
సందర్శించే సమయం: 6:30 నుండి 12:30 గంటల వరకు 4:30 నుండి 8:30 గంటల వరకు
ఎలా చేరుకోవాలి: ఈ ఆలయం శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ఇది పోండాలోని మార్డోల్‌కు నైరుతి దిశలో 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర గోవాలో పంజిమ్ కదంబ బస్టాండ్ నుండి 23 కి.మీ దూరంలో, వాస్కో డా గామా రైల్వే స్టేషన్ నుండి 40 కిమీ మరియు మార్గో రైల్వే స్టేషన్ నుండి 26 కిమీ దూరంలో ఉంది.