Devi Navaratri 2021: నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క అలంకరణ.. తొమ్మిది రూపాల్లో దర్శనం
Devi Navaratri 2021: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటాం. ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. వీటిని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు నవరాత్రులు అంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు.