Venkata Narayana |
Updated on: Oct 03, 2021 | 2:40 PM
70 ఏళ్ల వయసులోనూ ఈజీగా విదేశాలు చుట్టివస్తోన్న కేరళ కపుల్..
కొచ్చికి చెందిన ఈ జంట విదేశాలకు వెళ్లేందుకు కావలసినంత పొదుపు చేయాలనే పట్టుదలతో కాఫీ షాప్ అద్భుతంగా నడుపుతున్నారు.
KR విజయన్ (71) అతని భార్య మోహన (69) కొచ్చిలో 'శ్రీ బాలాజీ కాఫీ హౌస్' అనే కాఫీ షాపును నిర్వహిస్తున్నారు. ఈ షాప్ ను వాళ్లు 27 ఏళ్ల క్రితం 1994 లో ప్రారంభించారు.
ఇప్పటి వరకూ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా చుట్టేసిన విజయన్ దంపతులు.. తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి.. సంసార బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేసి విదేశీ విహారం చేస్తున్నారీ అన్నోన్య జంట.