Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourism: సెల్ ఫోన్ సిగ్నల్స్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు మీ కోసమే..

ప్రస్తుతం నడుస్తున్నదంతా ఇంటర్నెట్ యుగమే. ప్రతి చిన్న పని కోసం ఇంటర్నెట్ ను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఆన్‌లైన్ షాపింగ్, ఇష్టమైనవారితో సుదూర వీడియో కాల్‌లు, సోషల్ మీడియాలో అంతులేని..

Tourism: సెల్ ఫోన్ సిగ్నల్స్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు మీ కోసమే..
Travel Destinations
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 03, 2023 | 4:52 PM

ప్రస్తుతం నడుస్తున్నదంతా ఇంటర్నెట్ యుగమే. ప్రతి చిన్న పని కోసం ఇంటర్నెట్ ను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఆన్‌లైన్ షాపింగ్, ఇష్టమైనవారితో సుదూర వీడియో కాల్‌లు, సోషల్ మీడియాలో అంతులేని కంటెంట్ ను ఆస్వాదించడానికి ఇంటర్నెట్ ను అధికంగా ఉపయోగిస్తున్నాయి. అయితే నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లు.. నెట్ ఉపయోగం వల్ల ప్రయోజనాలతో పాటు సమస్యలూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు విస్తృతమవుతున్న కంటెంట్ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇందులో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలుసుకోవడం కష్టతరమవుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ అంతా డిజిటల్ మయమైపోయింది. సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడప్పుడు ఇంటర్నెట్ ప్రపంచానికి కొంత సమయం దూరంగా, ప్రకృతితో ఉండాలనిపిస్తుంది. అలాంటి వారు ఈ ప్రదేశాలను సందర్శిస్తే మంచి అనుభవాలను, జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చు.

ఫ్లవర్ వ్యాలీ, ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని ఈ సుందరమైన ప్రదేశానికి సెల్ ఫోన్ కవరేజీ లేదు. కానీ కనుచూపు మేరలో రంగురంగుల పూలతో లోయ కాంతులీనుతుంటుంది. ఇక్కడ చేపట్టే ట్రెక్కింగ్ లైఫ్ లో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

స్వర్గరోహిణి, ఉత్తరాఖండ్: స్వర్గరోహిణి ఉత్తరాఖండ్‌లోని మరొక సుందరమైన ప్రదేశం. ద్రౌపది, పాండవులు నడిచిన మార్గం అని చెబుతుంటారు. ఈ ప్రదేశం స్వర్గానికి ట్రెక్ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శించడానికి అనువైన సమయం మార్చి నుంచి డిసెంబర్ మధ్య ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అగుంబే, కర్ణాటక: దక్షిణాది చిరపుంజి గా ప్రసిద్ధి చెందిన అగుంబే కర్ణాటకలోని ఒక అందమైన గ్రామం. ఇది అనేక జలపాతాలు, మనోహరమైన దృశ్యాలతో నిక్షిప్తమై ఉంది.

జన్స్కార్, లడఖ్: ఐస్ కింగ్‌డమ్‌కు సెల్ ఫోన్ కవరేజీ లేదు. ఈ అందమైన ప్రదేశంలో మంచు యుగంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నుండి ఒక సన్నివేశంలో ఉన్నట్లు అనుభూతి చెందండి.

నాథంగ్ వ్యాలీ, సిక్కిం: ఇది సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉంది. అంతే కాకుండా దేశంలోని ఎత్తైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది.

అండమాన్ నికోబార్ దీవులు: అండమాన్ నికోబార్ దీవులలో చాలా తక్కువ ప్రదేశాల్లోనే ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. లోతైన మహా సముద్రాలు, నీలిరంగులో మెరిసే జలాలు, మనసు దోుచకునే సూర్యాస్తమయాలు, తెల్లటి ఇసుక తిన్నెలను సందర్శించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..