Tourism special: పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర సర్కార్.. నాగార్జునకొండ, పాపికొండకు ప్రత్యేక సర్వీసులు
ఇన్నాళ్లు నిరాశపడ్డ టూరిస్టులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలుగ రాష్ట్ర ప్రభుత్వాలు. వారం రోజుల్లో ఇటు పాపికొండలు, అటు నాగార్జున కొండకు లాంచీలు తిరగనున్నాయి.
Tourists Special services: ఇన్నాళ్లు నిరాశపడ్డ టూరిస్టులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలుగ రాష్ట్ర ప్రభుత్వాలు. వారం రోజుల్లో ఇటు పాపికొండలు, అటు నాగార్జున కొండకు లాంచీలు తిరగనున్నాయి. నాగార్జునకొండకు, నదిలో ప్రయాణం.. ఈ మాట వినగానే ఊహల్లో తేలిపోతారు పర్యాటకులు. కానీ కొన్ని కారణాల వల్ల నదిలో లాంచీల ప్రయాణాన్ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. అధికారుల రక్షణ చర్యల తర్వాత తిరిగి ప్రారంభించింది. తాజాగా గుంటూరు జిల్లా విజయపురి సౌత్ నుంచి నాగార్జునకొండకు బోటు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులకు అనుమతులు మంజూరు అయ్యాయని చెప్పారు అధికారులు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులనే కొండకు తీసుకెళ్తున్నామని, వారం రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
భద్రతా కారణాలతో గత రెండేళ్లుగా సాగర్‌లో పర్యాటక శాఖ బోట్లు నిలిపేవేసింది ఏపీ సర్కార్. ప్రస్తుతం పురావస్తు శాఖ ఉద్యోగులనే కొండకు వెళ్లేందుకు అనుమతి రాగా, వారి కోసమే బోటు నడిపారు. అటు త్వరలో తెలంగాణ నుంచి కూడా నాగార్జున కొండకు సర్వీసులు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నాగార్జునకొండకు వెళ్లడానికి కావల్సిన అనుమతి పత్రాలను తెలంగాణ పర్యాటక సంస్థ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చింది. ఇటీవలే ఏపీ అటవీ శాఖ అధికారులు తెలంగాణ లాంచీల ఫిట్‌నెస్‌ను పరీక్షించారు.
పాపికొండలు పర్యాటనకు స్పెషల్ ప్యాకేజీ మరోవైపు, పాపికొండలకు వెళ్లే పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ఈ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. పాపికొండల టూర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఈ నెల 24వ తేదీ నుంచి పర్యటనను ప్రారంభించడానికి ఆయన తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని శనివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999గా ధరను నిర్ణయించారు.