pilot to truck driver: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..
pilot to truck driver: ట్రక్ డ్రైవర్ అయినా.. బస్ డ్రైవర్ అయినా.. వాహనాన్ని నడపడానికి ముందు వారు తమ వాహనాల విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేస్తారు. అలా చేయడం వల్ల గ్లాస్ క్లియర్‌గా ఉండి.. రహదారి స్పష్టంగా కనిపిస్తుంది. మార్గంలో ఎలాంటి ప్రమాదం జరగదు.
ట్రక్ డ్రైవర్ అయినా.. బస్ డ్రైవర్ అయినా.. వాహనాన్ని నడపడానికి ముందు వారు తమ వాహనాల విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేస్తారు. అలా చేయడం వల్ల గ్లాస్ క్లియర్‌గా ఉండి.. రహదారి స్పష్టంగా కనిపిస్తుంది. మార్గంలో ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ, మీరు ఎప్పుడైనా పైలట్ విమానం గ్లాస్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు చూశారా? ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈవీడియో సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ వైరల్ వీడియోలో.. విమానం కాక్‌పిట్‌లో కూర్చున్న పైలట్ బాటిల్‌లోని నీటిని విమానం విండ్‌షీల్డ్‌పై పోసి, ఆపై దాని వైపర్‌లతో గ్లాస్‌ను క్లీన్ చేస్తాడు. అచ్చం ట్రక్ డ్రైవర్ లాగా. పైలట్ అలా చేస్తున్నప్పుడు.. కొందరు వీడియో తీశారు. 29 సెకన్ల ఆ వీడియోను @officeofdnj అనే ఇన్‌స్టాగ్రమ్ యూజర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..