కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..

Kedarnath Temple: దేశంలోని ప్రముఖ ఆలయాలలో కేదార్‌నాథ్ ఒకటి. ఈ ఆలయం ప్రస్తుతం తెరిచే ఉంది. భారీ మంచు కారణంగా నవంబర్ తర్వాత మూసివేస్తారు.

కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..
Kedarnath
Follow us
uppula Raju

|

Updated on: Nov 08, 2021 | 3:53 PM

Kedarnath Temple: దేశంలోని ప్రముఖ ఆలయాలలో కేదార్‌నాథ్ ఒకటి. ఈ ఆలయం ప్రస్తుతం తెరిచే ఉంది. భారీ మంచు కారణంగా నవంబర్ తర్వాత మూసివేస్తారు. ఇక్కడ శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది. ఆలయం మూసివేస్తారు. కేదార్‌నాథ్ ఆలయం వేసవి కాలం ప్రారంభంలో ఏప్రిల్‌లో తిరిగి తెరుస్తారు. మీరు ఒకవేళ కేదార్‌నాథ్‌ని సందర్శించాలనుకుంటే కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

1. చాలా వస్తువులను తీసుకెళ్లవద్దు మీరు కేదార్‌నాథ్‌ దర్శనం కోసం ప్రయాణిస్తున్నట్లయితే చాలా తక్కువ సామాను తీసుకెళ్లాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే కేదార్‌నాథ్ యాత్రలో చాలా ట్రెక్కింగ్ ఉంటుంది. అధిక వస్తువలు భారంగా ఉంటాయి.

2. వెచ్చని దుస్తులు వేసవి లేదా శీతాకాలం కావచ్చు కేదార్‌నాథ్ ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లని గాలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు అవసరం. వెచ్చని జాకెట్, స్కార్ఫ్, సాక్స్, టోపీని తీసుకెళ్లాలి.

3. సరైన షూస్ మీరు కేదార్‌నాథ్‌కు వెళ్లేటప్పుడు చాలా దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి మీ షూస్‌ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తేలికైన, మంచులో నడిచేవిధంగా ఉంటే బాగుంటుంది.

4. మందులు వెంట ఉండాలి కేదార్‌నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3587 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రయాణంలో చాలా మందికి జలుబు, దగ్గు వస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని మందులను మీతో ప్యాక్ చేసుకోవడం మంచిది. కొన్ని పెయిన్ కిల్లర్స్, యాంటిసెప్టిక్ క్రీములు, దగ్గు సిరప్‌లను మీ దగ్గర ఉంచుకోవాలి.

5. నీరు, ఆహారం తప్పనిసరి మీరు మీ బ్యాగ్‌లో కొంత ఆహారం, పానీయాలను ఉంచుకోవాలి. కేదార్‌నాథ్ సందర్శన సమయంలో నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మెరుగైన కనెక్టివిటీ కోసం మరొక SIM కార్డ్‌ని ఉంచుకుంటే మేలు.

6. మీరు కెమెరాను తీసుకువెళితే అదనపు బ్యాటరీ వెంట ఉండాలి. ఉదయాన్నే ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తమం. సాయంత్రం వాతావరణం చల్లగా మారుతుంది. కేదార్‌నాథ్‌లో ఎప్పుడైనా వర్షం పడవచ్చు కాబట్టి గొడుగు లేదా రెయిన్‌కోట్ ఉంటే మంచిది.

Crime News: అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు.. పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం..

Viral News: రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత సీన్ నెక్ట్స్ లెవల్

Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..