AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: ఆధ్యాత్మిక క్షేత్రాలను, బీచ్‌ను ఏకకాలంలో చూడాలనుకుంటున్నారా.. డివైన్ కర్ణాటక టూర్‌ని ట్రై చేయండి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నుంచి కర్ణాటక కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నవారికి టూర్ ప్యాకేజీని డివైన్ కర్ణాటక పేరుతో అందిస్తోంది. ఈ ప్యాకేజీలో ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు.. పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. మే నుంచి జూన్ నెల వరకు రైలు మార్గంలో ఈ టూర్ ను అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ రోజు ఈ టూర్ గురించి వివరాలు తెలుసుకుందాం.. 

IRCTC Tour: ఆధ్యాత్మిక క్షేత్రాలను, బీచ్‌ను ఏకకాలంలో చూడాలనుకుంటున్నారా.. డివైన్ కర్ణాటక టూర్‌ని ట్రై చేయండి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ చార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఉదయం రెండు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో లేనివి.. రైళ్లో భోజన ఖర్చులు, మధ్యాహ్నం భోజనం, దర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ చార్జీలు, గైడ్ తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
Surya Kala
|

Updated on: May 16, 2023 | 11:59 AM

Share

వేసవి నుంచి ఉపశమనం కోసం చాలామంది తమ ఫ్యామిలీతో సరదాగా గడపాలని భావిస్తారు. దీంతో విభిన్న ప్రాంతాలకు, లేదా పర్యటన ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. దీంతో తెలుగువారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నవారికి టూర్ ప్యాకేజీని డివైన్ కర్ణాటక పేరుతో అందిస్తోంది. ఈ ప్యాకేజీలో ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు.. పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. మే నుంచి జూన్ నెల వరకు రైలు మార్గంలో ఈ టూర్ ను అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ రోజు ఈ టూర్ గురించి వివరాలు తెలుసుకుందాం..

టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే.. 

మే 23 నుంచి హైదరాబాద్ నుంచి టూర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉండనుంది.  డివైన్ కర్ణాటక ప్యాకేజీ పేరుతో పర్యటకులకు అందుబాటులో ఉంటుంది. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉడుపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య వంటి అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రయాణం ఎలా సాగుతుందంటే.. 

Day 1: ఈ టూర్ మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. కాచిగూడ – మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 06.05 గంట‌ల‌కు రైలు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణించాల్సి ఉంటుంది.

Day 2: రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఉడిపికి వెళ్లి.. అక్కడ హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెష్ అప్ అయిన తర్వాత.. కృష్ణుడి దేవాలయాలన్నీ సందర్శించవచ్చు. అనంతరం.. సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ త‌దిత‌ర ప్రాంతాల‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి ఉడిపిలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day 3 : మూడో రోజు ఉడిపిలో ప్రఖ్యాత ఆలయం శ్రీకృష్ణ ఆలయం, శృంగేరి శారదాంబ ఆలయాలను సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం ఉడిపి నుంచి మంగళూరు బయలుదేరాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి మంగళూరులోనే బస చేయాల్సి ఉంటుంది.

Day 4: నాలుగో రోజు ఉదయం మంగళూరు నుంచి ధర్మస్థలిలోని ప్రముఖ మంజునాథ ఆలయాన్ని దర్శించుకోవాలి. అనంతరం కుక్కే సుబ్రహ్మణ్యాస్వామి ఆలయానికి చేరుకోవాలి. స్వామి దర్శనం అనంతర. సాయంత్రం తిరిగి మంగళూరు చేరుకొని రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

Day 5 : ఐదో రోజు ఉదయం మంగళూరులోని కతీల్ ఆలయం, మంగళా దేవి సందర్శించాలి. సాయంత్రం హోటల్ నుంచి చెక్ అవుట్ అయి రాత్రి 7 గం. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. అక్కడ నుంచి ట్రైన్ లో హైదరాబాద్ కు తిరిగి పయనం కావాల్సి ఉంటుంది. మర్నాడు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు 

ఈ టూర్ లో కంఫర్ట్ ప్యాకేజీ, స్టాండర్డ్ క్లాసులుగా అందిస్తున్నారు.

సింగిల్ ఆక్యూపెన్సీ ధర- రూ.32,890

డబుల్ ఆక్యూపెన్సీ ధర – రూ. 19,690 (ఒకొక్కరికి)

ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర – రూ.16,210 (ఒకొక్కరికి)

స్టాండర్డ్ క్లాసులో ప్యాకేజీ ధరలు 

సింగిల్ ఆక్యూపెన్సీ ధర- రూ.29,990

డబుల్ ఆక్యూపెన్సీ ధర – రూ.16,690

ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర – రూ.13,210

అయితే 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇతర సదుపాయాలు ఏమిటంటే.. 

ఈ ప్యాకేజీలో భాగంగా హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ ను ప్రయాణీకులకు అందిస్తుంది. ఈ టూర్ పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..