Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tirupati Tour: శ్రీవారి దర్శనానికి టికెట్స్ లేవా.. IRCTC అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్ ఆప్షన్.. పూర్తి వివరాలు

వేసవి కాలం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన తర్వాత స్కూల్స్ కు సెలవులు ఇస్తారు. దీంతో తమ కుటుంబ సభ్యులతో వివిధ ప్రాంతాలకు వెళ్ళాలని భావిస్తారు. ముఖ్యంగా తెలుగువారు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం కోసం ఆసక్తిని చూపిస్తారు. తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళాలని కోరుకున్నా.. అప్పటికప్పుడు దర్శనం ఎలా దొరుకుంతుంది అని ఆలోచించే వారికి ఐఆర్ సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుమల క్షేత్రానికి వెళ్ళడానికి సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC Tirupati Tour: శ్రీవారి దర్శనానికి టికెట్స్ లేవా.. IRCTC అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్ ఆప్షన్.. పూర్తి వివరాలు
Irctc Tirupati Tour Package
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2025 | 11:37 AM

వేసవి సెలవులు వచ్చిన వెంటనే చాలా మంది అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళాలని కోరుకుంటారు.ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరబాద్ నగర వాసుల కోసం సరికొత్త ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ లో తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తిని దర్శించుకోవచ్చు. ఈ టూర్ ను రైలు ద్వారా ప్రయనించాల్సి ఉంటుంది. తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పేరుతో సాగనున్న ఈ టూర్ మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు ఉంటుంది. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ టూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (TIRUPATI BY VENKATADRI EXPRESS)పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఆపరేట్ చేస్తోన్న ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి మొదలు అవుతుంది. ఈ టూర్ నాలుగు రోజులు పాటు ఉంటుంది. ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

టూర్ షెడ్యూల్ వివరాలు

  1. మొదటి రోజు: కాచిగూడ స్టేషన్ నుంచి రాత్రి 8.5 గంటలకు వెంటకటాద్రి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12797) బయల్దేరుతుంది. ఈ రోజు రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
  2. రెండో రోజు: ఉదయం 07.05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడ హోటల్ కి చేరుకొని చెకిన్ అవుతారు. తర్వాత ఫ్రెషప్ అయ్యి.. తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి పయనం అవుతారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతికి చేరుకుంటారు. తాము బస చేసిన హోటల్ కి చేరుకుంటారు. రాత్రి డిన్నర్ ముగించి తిరుపతిలోనే బస చేయాల్సి ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మూడో రోజు: తెల్లవారుజామునే రెడీ అయ్యి.. హోటల్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి కొండ మీదకు బయల్దేరుతారు. తిరుమలకు చేరుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఈ దర్సనం ఉచితంగానే ఉంటుంది. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి తిరుపతిలోని హోటల్ వద్దకు చేరుకోవాలి.
  5. మూడో రోజు: సాయంత్రం హోటల్ చెక్ అవుట్ అయ్యి.. తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఇక్కడ 06.35 గంటల రైలు (12798నెంబర్ )ను ఎక్కి తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు.
  6. నాలుగో రోజు ఉదయం 06.20 గంటలకు హైదరబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో తిరుపతి టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు

కంఫర్ట్ క్లాస్(3AC)లో సింగిల్ షేరింగ్-రూ. 13810.

డబుల్ షేరింగ్- రూ. 10720,

ట్రిపుల్ షేరింగ్- రూ. 8940

5- 11 ఏళ్ల వయసున్న పిల్లలకు విత్ బెడ్ రూ. 6480

5 -11 ఏళ్ల వయసున్న పిల్లలకు విత్ అవుట్ బెడ్ రూ. 5420

స్టాండర్డ్ క్లాస్(SL) లో

సింగిల్ షేరింగ్- రూ. 12030,

డబుల్ షేరింగ్- రూ. 8940,

ట్రిపుల్ షేరింగ్ – రూ. 7170 గా ఉంది.

చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.

5- 11 ఏళ్ల వయసున్న పిల్లలకు విత్ బెడ్ రూ. 4710

5 -11 ఏళ్ల వయసున్న పిల్లలకు విత్ అవుట్ బెడ్ రూ. 3650

ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుపతి వెళ్ళాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ మంచి ఎంపిక. ప్రస్తుతం ఈ ట్రైన్ మార్చి 29వ తేదీన భక్తులకు అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో తిరుపతి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ తో పాటు మరింత సమాచారానికి IRCTC అధికారిక వెబ్ సైట్ లోని లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.