- Telugu News Photo Gallery Summer Healthcare tips: Raw Onion eating during lunch give health benefits know what says expert
Summer Health Tips: ఉల్లిపాయలను వేసవిలో ఇలా తినండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
ప్రతి ఒక్కరి ఇంట్లోని వంట గదిలో లభించే ఉల్లిపాయకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఉల్లి పాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆహార రుచిని పెంచుతుంది. చాలా మంది ఉల్లి పాయని వివిధ రూపాల్లో తింటారు. అయితే వేసవిలో ఉల్లిపాయలను తినడం.. అది కూడా పచ్చి ఉల్లిపాయలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Updated on: Mar 24, 2025 | 9:46 AM

ప్రతి ఇంటిలోనూ పచ్చి ఉల్లిపాయలు తప్పనిసరిగా ఉంటుంది. ఉల్లిపాయలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఆహారానికి అదనపు రుచిని పెంచడానికి ఉల్లిపాయలను వంటల్లో ఉపయోగిస్తారు. అయితే, చాలా మంది పచ్చి ఉల్లిపాయలను తింటారు. ఉల్లిపాయలను తరచుగా సలాడ్లలో ఉపయోగిస్తారు.

ఉల్లిపాయలు లేని కూర రుచి ఉండదని.. తినడానికి కూడా ఇష్టపడరు కొందరు. మటన్, చికెన్ కూరల్లోనే కాదు పప్పు, పులుసు, వేపుడుల్లో కూడా ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. అయితే వేసవిలో ఉల్లిపాయలను పచ్చిగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేసవి నెలల్లో మధ్యాహ్న భోజన సమయంలో పచ్చి ఉల్లిపాయలు తినడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్ వంటి వివిధ రకాల పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణురాలు ప్రియా పలివాల్ అన్నారు. అందువల్ల ఉల్లిపాయలను సలాడ్‌గా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ ఇచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుదల వేసవిలో గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తరచుగా సంభవించవచ్చు. పచ్చి ఉల్లిపాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో చాలా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కడుపును శుభ్రపరుస్తుంది. అంతేకాదు ఉల్లిపాయ కడుపును ఏ రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అదనంగా శరీరాన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. కనుక సలాడ్లలో పచ్చి ఉల్లిపాయలను చేర్చుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెప్పారు.

చర్మానికి మంచిది ఉల్లిపాయల్లో సల్ఫర్, విటమిన్ సి ఉంటాయి. కనుక అవి చర్మానికి మేలు చేస్తాయి. చర్మపు చికాకును తగ్గించడానికి, మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. వేసవిలో అధిక చెమట, కాలుష్యం చర్మానికి హాని కలిగిస్తాయి. పచ్చి ఉల్లిపాయలు తింటే అవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి

మధుమేహ రోగులకు మంచిది పచ్చి ఉల్లిపాయల్లో క్రోమియం సహా ఇతర అంశాలు ఉన్నాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.





























