- Telugu News Photo Gallery Amazing Health Benefits of Cumin Water: Jeera Water for Lose Belly Fat, Control Blood Sugar
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే షుగర్ కూడా మటాషే..
ప్రతి పది మందిలో దాదాపు ఐదారుగురు.. అధిక బరువు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. వీటినుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు..
Updated on: Mar 24, 2025 | 11:12 AM

ఉరుకుపరుగుల జీవితం.. అనారోగ్యకరమైన ఆహారం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో రకాల సమస్యలతో చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పది మందిలో దాదాపు ఐదారుగురు.. అధిక బరువు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే.. వీటినుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. మన వంటింట్లో ఉండే జీలకర్రతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.. వాస్తవానికి జీరా (జీలకర) ప్రతి వంటగదిలో తప్పనిసరిగా ఉండే మసాలా దినుసు.. జీరా ఆహారానికి గొప్ప రుచిని ఇస్తుంది. అంతే కాదు, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీలకర్రలో పాలీఫెనాల్స్.. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే అనేక సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర నీరు వివిధ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే.. జీలకర్ర నీటిని రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి జీర్ణవ్యవస్థ.. బాగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియ రేటును మెరుగుపరచడానికి.. బరువు తగ్గడానికి జీలకర్ర నీరు అద్భుతమైనదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జీలకర్ర శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జీలకర్ర నీరు తాగడం వల్ల శరీరం కొత్త, ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే జీలకర్ర నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

జీలకర్రలోని ఫ్లేవనాయిడ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. జీలకర్ర టైప్ 2 డయాబెటిస్‌లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.

జీలకర్రలో ఉండే ఇనుము, ఫైబర్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, కాలానుగుణ వ్యాధులతో పోరాడడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పరగడుపున ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగడం వల్ల మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ముందుగా ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను వేసి.. వేడి చేయండి.. మరిగించిన తర్వాత.. ఒక కప్పులోకి ఆ నీటిని తీసుకోని తాగండి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా తాగడచ్చు.. అయితే.. ఇది వేడి స్వభావాన్ని కలిగిఉంటుంది.. రెండు కప్పులు మాత్రమే తాగడం మంచిది.





























