Dubai Tour: మిరుమిట్లు గొలిపే దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా..? ఇదే మంచి అవకాశం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
దుబాయ్ అందాలను, విలాసవంతమైన పెద్ద పెద్ద భవనాలను చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీపీ ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ టూర్ ఉండనుంది. బస, వసతి అన్నీ సౌకర్యాలు కల్పించనుంది. ఇందుకోసం ముందుగానే బుక్ చేసుకోవాలి.

Dubai Special Package: ఇండియా నుంచి ఎక్కువమంది దుబాయ్ వెళుతుంటారు. కొంతమంది ఉపాధి రీత్యా వెళుతుంటే.. మరికొంతమంది అక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు చూసేందుకు వెళుతుంటారు. దుబాయ్‌లో సుందరమైన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటి ద్వారా పర్యాటకులను దుబాయ్ తెగ ఆకర్షిస్తోంది. ఒక్కసారైనా వెళ్లి దుబాయ్ అందాలు చూసి రావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా వెళ్లాలి..? అక్కడ ఏయే ప్రదేశాలు చూడాలి..? బస ఎక్కడ చేయాలి..? అనే విషయాలపై అవగాహన ఉండదు. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ దుబాయ్ అద్బుతాలు పేరుతో ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది. దీని ద్వారా మీర తక్కువ ధరలోనే దుబాయ్ చూసి రావొచ్చు. ఆ ప్యాకేజ్ వివరాలు డీటైల్డ్‌గా ఇక్కడ చూద్దాం.
కవర్ చేసే ప్రదేశాలు
దుబాయ్, అబుదాబి. ఈ టూర్ 5 రోజులు ఉంటుంది. 4 రాత్రులు దుబాయ్‌లోనే ఉంటారు. వసతి, ఫుడ్ సౌకర్యాలు అన్నీ కల్పిస్తారు. కేవలం 34 మంది ప్రయాణికులకు మాత్రమే ఈ టూర్‌లో పాలుపంచుకునే అవకాముంది.
ఎప్పుడు ప్రారంభమవుతుంది..?
వచ్చే ఏడాది జనవరి 23న ఈ టూర్ ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో బయల్దేరి 27వ తేదీ తిరిగి దుబాయ్ నుంచి హైదరాబాద్ ప్రయాణమవుతారు. ఈ టూర్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
ప్యాకేజీ ధర
సింగిల్ షేరింగ్ రూ.1,34,700, డబుల్ షేరింగ్ ఒక్కో వ్యక్తి రూ.1,13,200గా ఉంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొ వ్యక్తికి రూ.1,12,000గా ఉంది. చైల్డ్ విత్ బెడ్ అయితే రూ.1,09,800గా ఉండగా.. చైల్డ్ వితౌడ్ బెడ్ అయితే రూ.1,00,900గా ఉంది.
చూపించే ప్రదేశాలు ఇవే..
ధో క్రూయిజ్ దుబాయ్ మెరీనా, అబ్జర్వేషన్ వీల్స్, , డెజర్ట్ సఫారీ, మిరాకిల్ గార్డెన్ , గ్లోబల్ విలేజ్ , బుర్జ్ ఖలీఫా, లైట్ షో , అబుదాబి సిటీ టూర్, BPAS టెంపుల్, ఫెరారీ వరల్డ్ ఫోటో షూట్, షేక్ జాయెద్ మసీదు
3 స్టార్ హోటల్స్‌లో వసతి
విమాన ఛార్జీలతో పాటు 3 స్టార్ హోటల్స్‌లో బస, భోజనం, ధో క్రూయిజ్‌లో విందు, వీసా ఛార్జీలు ప్యాకేజీలో కవర్ అవుతాయి.
బుకింగ్ ఎలా చేసుకోవాలి..?
https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ సమయంలో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ ఇవ్వాలి. వీసా అవసరాల కోసం ఒరిజినల్ పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఫొటో సాఫ్ట్ కాపీ అందించాలి.
