White Teeth Tips: మీ పళ్లు తెల్లగా మిలమిల మెరవాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి.
ముఖానికి అందం చిరునవ్వు. కానీ నవ్వినప్పుడు దంతాలు పసుపు రంగులో కనిపిస్తే..మీ అందాన్ని అందవిహీనంగా మారుస్తాయి. దంతాలు పసుపురంగులోకి మారడానికి ప్రధాన కారణం దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడమే. పళ్లపై సూక్ష్మజీవుల వృద్ది వల్ల దంతాలపై పసుపు చారలు పేరుకుపోయి…చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులన్నీ కొనుగోలు చేసి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ వాటి రంగు మాత్రం మారదు. కానీ మీ ఇంట్లోనే దంతాలను తెల్లగా చేయడానికి […]
ముఖానికి అందం చిరునవ్వు. కానీ నవ్వినప్పుడు దంతాలు పసుపు రంగులో కనిపిస్తే..మీ అందాన్ని అందవిహీనంగా మారుస్తాయి. దంతాలు పసుపురంగులోకి మారడానికి ప్రధాన కారణం దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడమే. పళ్లపై సూక్ష్మజీవుల వృద్ది వల్ల దంతాలపై పసుపు చారలు పేరుకుపోయి…చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులన్నీ కొనుగోలు చేసి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ వాటి రంగు మాత్రం మారదు. కానీ మీ ఇంట్లోనే దంతాలను తెల్లగా చేయడానికి మీరు మీ వంటగదిలో ఉండే పదార్థాలను ఉపయోగిస్తే చాలు. మీ పళ్లు తెల్లగా మిలమిలా మెరిసిపోతాయి. ఆ పదార్థాలేంటో చూద్దామా.
- బేకింగ్ సోడా: బేకింగ్ సోడా పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మారుస్తుంది. తేలికపాటి రాపిడి లక్షణాల కారణంగా దంతాల నుంచి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి, మందపాటి పేస్టులా చేయాలి. ఈ పేస్టుతో కొన్ని నిమిషాల పాటు మీ దంతాలను సున్నితంగా బ్రష్ చేయాలి. అయితే బేకింగ్ సోడాను అధికంగా వాడితే పంటి ఎనామెల్ ను చెరిపేస్తుంది. కాబట్టి ఈ రెమెడీని తక్కువగా ఉపయోగించండి.
- హైడ్రోజన్ పెరాక్సైడ్: దంతాలను తెల్లబరచడంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని సమానంగా తీసుకుని కలపండి. ఒకటి లేదా రెండు నిమిషాలు ఈ మిశ్రమాన్ని మీ నోటిలో ఉంచి పుకిలించండి…దానిని మింగకుండా చూసుకోండి. తర్వాత ఆ ద్రవణాన్ని ఉమ్మివేయాలి. తర్వాత శుభ్రమైన నీటిని తీసుకుని మీ నోటిని బాగా కడగాలి. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.
- ఆయిల్ పుల్లింగ్: ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తీసుకుని 15-20 నిమిషాల పాటు నోట్లో పుకిలించండి. నూనె మింగకుండా దానిని ఉమ్మివేయాలి. తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. కాలక్రమేణా ఆయిల్ పుల్లింగ్ ఫలకం, బ్యాక్టీరియా తొలగించడమే కాకుండా దంతాలను తెల్లగా చేస్తుంది.
- స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీస్ లో మాలిక్ యాసిడ్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా చేస్తుంది. పండిన స్ట్రాబెర్రీని మాష్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీ గుజ్జును మీ దంతాలపై అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి…తర్వాత కడిగివేయండి. ఎక్కువ సేపు ఉంచితే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.
- యాపిల్ సైడర్ వెనిగర్: పళ్లను నేచురల్ గా క్లీన్ చేయడంతోపాటు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా వాటిని తెల్లగా మార్చుతుంది. అయితే మీరు దీన్ని చాలా తక్కువగా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కరిగించి…మౌత్ వాష్ గా ఉపయోగించాలి. వెనిగర్ లోని ఆమ్లత్వం దంతాల ఎనామెల్ హానికలిగిస్తుంది. కాబట్టి దీనిని తరచుగా ఉపయోగించకుండా జాగ్రత్తగా వహించాలి.
- యాక్టివేటెడ్ చార్ కోల్: యాక్టివేటెడ్ చార్ కోల్ తో దంతాల మరకలను తొలగించవచ్చు. మీ టూత్ బ్రష్ ను నీటితో కడిగి, యాక్టివేటెడ్ చార్ కోల్ పౌడర్ లో ముంచండి. కొన్ని నిమిషాల పాటు మీ దంతాలను సన్నితంగా బ్రష్ చేయండి. ఇలా తోమడం వల్ల పళ్లపై ఉన్న మరకలన్నీ తొలగిపోతాయి. యాక్టివేట్ చేయసిన బొగ్గు రాపిడితో కూడుకుని ఉంటుంది. కాబట్టి దీనిని తక్కువగా ఉపయోగించాలి.
- బ్రషింగ్ ఫ్లాసింగ్: తెల్లటి చిరునవ్వును మెయింటైన్ చేయడం అవసరం. నోటి పరిశుభ్రత బ్రషింగ్, ఫ్లాసింగ్ వంటి పద్దతులు పళ్లపై మరకలను నివారించడానికి, మీ దంతాల నుంచి ఫలకాన్ని తొలగించడానికి టూత్ పేస్టుతో రోజుకు రెండు సార్లు బ్రష్ చేయండి.
(ఈ ఇంటి చిట్కాలు దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. నోటికి సంబంధించి ఇతర సమస్యలు ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి)
మరిన్ని లైఫ్ స్టైల్ కథనాలు చదవండి..