AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవ్వును ఇట్టే కరిగించి స్లిమ్‌గా చేసే..మార్నింగ్‌ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

ఉడికించిన గుడ్లు, ఓట్స్, బాదం, ఆపిల్‌, అరటి పండ్లు వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇది పేగులోని మంచి బ్యాక్టీరియాకు ప్రయోజనం అందిస్తుంది. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో కొవ్వు పెరుగుతుందనే టెన్షన్‌ ఉండదు. ఇలాంటి ఆహారంతో మీ జీవక్రియను పెంచుకునే అవకాశం ఉంది. ఇవి మీ శరీరంలో కొవ్వు తగ్గించి త్వరగా స్లిమ్‌ అయ్యేలా చేస్తాయి. అలాంటి బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..

కొవ్వును ఇట్టే కరిగించి స్లిమ్‌గా చేసే..మార్నింగ్‌ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
Healthy Breakfast
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2025 | 7:51 AM

Share

మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అస్సలు స్కిప్‌ చేయకూడదని పోషకాహార, వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే మనం తినే ఆహారం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన రోజంతటికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అందుకే శరీరానికి మంచి మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ అందించే ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలి. ఉడికించిన గుడ్లు, ఓట్స్, బాదం, ఆపిల్‌, అరటి పండ్లు వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఇది పేగులోని మంచి బ్యాక్టీరియాకు ప్రయోజనం అందిస్తుంది. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో కొవ్వు పెరుగుతుందనే టెన్షన్‌ ఉండదు. ఇలాంటి ఆహారంతో మీ జీవక్రియను పెంచుకునే అవకాశం ఉంది. ఇవి మీ శరీరంలో కొవ్వు తగ్గించి త్వరగా స్లిమ్‌ అయ్యేలా చేస్తాయి. అలాంటి బెస్ట్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. ​ఉడకబెట్టిన గుడ్లు ​:

ప్రోటీన్స్ అధికంగా ఉండే గుడ్లు శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే 2 నుండి 3 గుడ్లు తినడం వలన శక్తి ని ఇవ్వడం తోపాటు ఆకలిని నియంత్రిస్తుంది. గుడ్లు కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది.

​ఓట్స్‌​:

ఇవి కూడా చదవండి

ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పొద్దున్నే ఓట్స్ తినడం వలన ఆకలిని నియంత్రిస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఓట్స్ లోని ఫైబర్ జీర్ణ శక్తిని పెంచడంతోపాటు కొవ్వును కరిగిస్తుంది.

​ఆపిల్‌​:

ఆపిల్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆపిల్ ఆకలిని నియంత్రిచడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది.

​అరటి పండు​:

అరటి పండులో నేచురల్ షుగర్ తోపాటు ఫైబర్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తూ ఆకలిని నియంత్రిస్తుంది.

బాదం: బాదంలో ప్రోటీన్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఉదయం 5 నుండి 6 బాదంలు తినడం వలన శక్తిని ఇస్తుంది. బాదం కూడా కొవ్వును కరిగించడానికి సహాయ పడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us