AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Bad breath: నిద్రలేవగానే నోరు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..! రిలాక్స్‌ అవుతారు..

కొన్నిసార్లు రాత్రి పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొంతమందిలో ఉదయాన్నే నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇది చాలా సాధారణ సమస్య. నోటి దుర్వాసన అనేది సాధారణంగా మీరు తీసుకునే ఆహారం, పానీయాల వల్ల వస్తుంది. తిన్న పళ్లల్లో ఇరుక్కుపోవటం, రాత్రంతా నోటిలో ఉండిపోవటం కారణంగా అవి దుర్వాసనను కలిగిస్తాయి. నోటిలో ఉండిపోయిన ఆహారంతో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది.

Morning Bad breath: నిద్రలేవగానే నోరు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..! రిలాక్స్‌ అవుతారు..
Morning Bad Breath
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2025 | 7:43 AM

Share

రోజుకు రెండు పూట బ్రష్‌ చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగం. కానీ, చాలా మంది బద్ధకంతో ఈ అలవాటును విస్మరిస్తూ ఉంటారు. అలాగే, ఎక్కువ మందికి రాత్రిపూట బ్రష్‌ చేసుకునే అలవాటు ఉండదు. అలాంటి వారిలో కొందరికి ఉదయాన్నే నోరు దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు రాత్రి పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొంతమందిలో ఉదయాన్నే నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇది చాలా సాధారణ సమస్య. నోటి దుర్వాసన అనేది సాధారణంగా మీరు తీసుకునే ఆహారం, పానీయాల వల్ల వస్తుంది. తిన్న పళ్లల్లో ఇరుక్కుపోవటం, రాత్రంతా నోటిలో ఉండిపోవటం కారణంగా అవి దుర్వాసనను కలిగిస్తాయి. నోటిలో ఉండిపోయిన ఆహారంతో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది.

నోటి దుర్వాసనను నివారించడానికి బెస్ట్‌ రెమిడీ నోటి పరిశుభ్రతను పాటించడం. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్‌ చేసుకోవటం తప్పనిసరి. కనీసం రెండు నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేయండి. మీ చిగుళ్ళు, నాలుక, మీ బుగ్గల లోపలి భాగాన్ని కూడా సున్నితంగా బ్రష్ చేయండి. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ఉండవచ్చు. ఎల్లప్పుడూ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్, యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ ఉపయోగించండి. ఇకపోతే, నోటి దుర్వాసనను దూరం చేసే కొన్ని హోం రెమిడీస్ ఇక్కడ చూద్దాం..

నోటి దుర్వాసనకు సోంపు బెస్ట్‌ రెమిడీగా పనిచేస్తుంది. సోంఫులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. తద్వారా తాజా శ్వాసకు కారణమవుతాయి. అందుకే నోరు దుర్వాసన పోవాలంటే సోంఫు నమలడం మంచిది. నోటి దుర్వాసన పోవాలంటే మెంతులు కూడా ఉపయోగించొచ్చు. ఓ గిన్నె నీటిలో కొన్ని మెంతులు వేసి మరిగించండి. దీనిని వడపోసి తాగితే నోటి దుర్వాసన తొందరగా పోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం: నిమ్మరసం కూడా నోటిలో వచ్చే దుర్వాసనకు చెక్‌ పెడుతుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నోటిలో చెడు బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. తద్వారా నోటి దుర్వాసన దూరం చేస్తుంది. నోరు దర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ నిమ్మరసం తాగడం మంచిది.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి దుర్వాసన పోగొడుతుంది. దీనికోసం దాల్చినచెక్క నేరుగా నమలొచ్చు లేదా టీ చేసుకుని తాగొచ్చు.

లవంగాలు: లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి నోరు దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం రోజు ఒకటి లేదా రెండు లవంగాలు నమిలితే సరిపోతుంది.

అల్లం: అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దంతాలతో పాటు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోరు దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం అల్లం ముక్క తినడం లేదా అల్లం టీ తాగితే సరిపోతుంది.

పుదీనా: పుదీనాలోని కూలింగ్, యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసన తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం పుదీనా ఆకులు నమిలితే సరిపోతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌: యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఎసిడిక్ నేచర్ నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీనికోసం నీటిలో వెనిగర్ వేసి దానిని మౌత్ వాష్‌లాగా ఉపయోగించండి. ఇలా చేస్తే దుర్వాసన పోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..