AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oesophageal cancer: పొగలు కక్కే టీ లేదా కాఫీ తాగడం అలవాటా? క్యాన్సర్ పొంచి ఉంది జాగ్రత్త!

అంతర్జాతీయ మెడికల్ జర్నల్‌లో ఈ వారం ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి పానీయం టీ లేదా కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

Oesophageal cancer: పొగలు కక్కే టీ లేదా కాఫీ తాగడం అలవాటా? క్యాన్సర్ పొంచి ఉంది జాగ్రత్త!
Hot Coffee
Madhu
|

Updated on: Feb 21, 2023 | 10:14 AM

Share

ఉదయాన్నే వేడి వేడి కాఫీ లేదా టీ గొంతులో పడనిదే చాలా మందికి తెల్లవారదు. పొగలు కక్కే పానియం కళ్లతో చూస్తూ తాగకనిదే రోజు ప్రారంభమవుదు. మీకు ఇలాంటి అలవాటు ఉందా? అయితే ఈ కథనం తప్పక చదవాల్సిందే. ఎందుకంటే అధిక వేడితో పానియాలు తీసుకొనే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందట. గొంతులో వేడి వేడి టీ లేదా కాఫీ వెళ్తున్న క్రమంలో అన్న వాహిక క్యాన్సర్ కు కారణమవుతుందని ఇటీవల ఓ పరిశోధన తేల్చిందట. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కాఫీ లేదా టీ వంటి వేడి పానీయాలను కూడా క్యాన్సర్ కారక జాబితాలో చేర్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

60 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండకూడదు..

అంతర్జాతీయ మెడికల్ జర్నల్‌లో ఈ వారం ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి పానీయం టీ లేదా కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 700 ml వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90 శాతం పెరుగుతుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) లో 10 దేశాల నుంచి 23 మంది శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలో పాల్గొంది. అధిక ఉష్ణోగ్రత పానీయాలు, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసింది.

ఇతర సమస్యలు కూడా..

ఎక్కువ వేడి పానీయాలు తీసుకోవడం వల్ల నాలుక చుట్టూ చాలా సున్నితంగా ఉండే రుచి మొగ్గలు కూడా ప్రభావితమవుతాయి. వేడి పానీయాలకు గురైనప్పుడు అవి ఇతర కణాల మాదిరిగానే దెబ్బతింటాయి. అలాగే వేడి పానీయాల వినియోగం పెదవులపై కూడా ప్రభావం చూపుతుంది, చాలా సందర్భాలలో పెదవులు నల్లబడతాయి. వేడి పానీయాల నిరంతర వినియోగం గుండెల్లో మంటను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎంత వేడిగా ఉండాలి..

60°C లేదా 140°F అంతకంటే ఎక్కువ వేడితో రోజుకు 700 మిల్లీలీటర్ల వేడి టీ లేదా తాగేవారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90 శాతం పెరుగుతుందని ఇరాన్‌కు చెందిన ఒక అధ్యయనం కనుగొంది. అన్నవాహిక అనేది బోలు కండరాలతో ఉండే గొట్టం, ఇది ద్రవాలు, లాలాజలం, నమలిన ఆహారాన్ని నోటి నుండి మీ కడుపుకు తీసుకువెళుతుంది. అన్నవాహికలో కణితి పెరిగినప్పుడు లేదా అన్నవాహిక లైనింగ్‌లోని కణాలు మారినప్పుడు అన్నవాహిక క్యాన్సర్ వస్తుంది. దీర్ఘకాలిక దగ్గు, అజీర్ణం లేదా గుండెల్లో మంట, గొంతు బొంగురుపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, అన్నవాహికలో రక్తస్రావం వంటి లక్షణాలు గమనించినిప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి..