Pregnancy: గర్భిణీలు గుడ్లు తినడం మంచిదేనా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భధారణ సమయంలో మహిళలు ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు. గుడ్లలో విటమిన్-బి12, విటమిన్-డి, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పెట్టింది పేరు. పాలలోని ఈ గుణాలు గర్భిణీలకు సరైన పోషకాహారం అందిస్తాయి. అయితే గర్భధారణ సమయంలో...

మహిళల జీవితాల్లో గర్భం దాల్చడం ఎంతో కీలకమైన ఘట్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తల్లిగా మారబోతున్నానే ఆలోచన, మరో వైపు శరీరంలో జరిగే మార్పులు మహిళలను ఆందోళనకు గురి చేస్తుంటాయి. ఇక గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో గర్భిణీలు కోడి గుడ్లను తీసుకోవడం మంచిదేనా.? కాదా అన్న ప్రశ్న వేధిస్తుంటుంది. ఇంతకీ గర్భిణీలు కోడి గుడ్లను తీసుకునే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భధారణ సమయంలో మహిళలు ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చు. గుడ్లలో విటమిన్-బి12, విటమిన్-డి, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పెట్టింది పేరు. పాలలోని ఈ గుణాలు గర్భిణీలకు సరైన పోషకాహారం అందిస్తాయి. అయితే గర్భధారణ సమయంలో గుడ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటేంటే..
గర్భిణీలు ఉడికించిన గుడ్లను తీసుకోవడమే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో సరిగా ఉడికించని గుడ్లు తినడం మానుకోవాలి. ఎందుకంటే పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. అయితే గుడ్డును ఉడికిస్తే.. ఈ హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది. అలాగే ఆమ్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ఇక అలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చి గుడ్డును తినకపోవడమే బెటర్. గర్భిణీలు గుడ్లు తినే ముందు బాగా ఉడికించాలి.
గుడ్లు బాగా ఉడకడానికి 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. ఇక గర్భంతో ఉన్న సమయంలో కోడి గుడ్లను తీసుకుంటే.. గుడ్డులోని ప్రొటీన్లు కడుపులోని బిడ్డ కణాలు, కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. కోడిగుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది శిశువు మెదడతో పాటు నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. గుడ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీలతో పాటు కడుపులోని బిడ్డ ఎముకలను బలపరుస్తుంది. గుడ్లలో ఉండే విటమిన్, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




