AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy lifestyle: బీ అలర్ట్‌..! సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నవారిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయి..!! ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి..

కూర్చొని ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఎక్కువగా కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో పని చేస్తారు. 8 నుండి 9 గంటల పాటు కంప్యూటర్ స్క్రీన్ నే చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దాని నుండి వెలువడే నీలి కిరణాలు కళ్ళకు హాని చేస్తాయి. దీని ప్రభావంతో కంటి చూపును బలహీనపడుతుంది. సిట్టింగ్ జాబ్స్‌లో పనిచేసే వారందరూ

Healthy lifestyle: బీ అలర్ట్‌..! సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నవారిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయి..!! ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి..
Sitting Jobs
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2024 | 2:20 PM

Share

ప్రస్తుతం చాలా మంది సిట్టింగ్ జాబ్స్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు చాలా వరకు 8 నుండి 9 గంటల షిఫ్టుల ప్రకారం ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వారంతా 8 నుండి 9 గంటల పాటు నిరంతరం కూర్చుని పని చేస్తారు. అయితే, ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా.? సిట్టింగ్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ జాబ్స్ ఉన్నవారిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయి. శ్రద్ధ వహించండి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఒకే చోట కూర్చొని నిరంతరాయంగా పని చేయడం వల్ల కేలరీలు బర్న్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కొన్నిసార్లు ఊబకాయానికి గురవుతారు. అది కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుంది. ఊబకాయం శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధుల కు కూడా దారితీస్తుంది. కూర్చుని ఉద్యోగాలు ఉన్నవారు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావడం తరచుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే చోట కూర్చోవడం వల్ల వారి ఆహారం జీర్ణం కాదు. అలాంటి వారిలో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. మోకాళ్ల నొప్పులు కూడా వేధిస్తాయి. ఈ రోజుల్లో 9 గంటలపాటు కూర్చొని చేసే ఉద్యోగంలో శరీరంలో రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల కాళ్లలో జలదరింపు సమస్య కూడా ఉంటుంది. కూర్చుని పని చేసే వ్యక్తుల్లో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. వారు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అలాంటి వ్యక్తులు వీలైతే క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా సాధన చేయాలి.

ఇవి కూడా చదవండి

కూర్చొని ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఎక్కువగా కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో పని చేస్తారు. 8 నుండి 9 గంటల పాటు కంప్యూటర్ స్క్రీన్ నే చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దాని నుండి వెలువడే నీలి కిరణాలు కళ్ళకు హాని చేస్తాయి. దీని ప్రభావంతో కంటి చూపును బలహీనపడుతుంది. సిట్టింగ్ జాబ్స్‌లో పనిచేసే వారందరూ బ్లూ కట్ లెన్స్‌లు ఉన్న గ్లాసెస్ ధరించాలి. నిరంతరం కూర్చొని పని చేసే వ్యక్తుల్లో టైప్ 2 డయాబెటిస్‌ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో దీనిని నివారించడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం కూడా చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..