Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: జీవనశైలిలో ఈ పద్ధతులు మనల్ని త్వరగా వృద్ధాప్యంలోకి నేట్టేస్తాయి.. అవేమిటో తెలుసుకోండి!

మన జీవనశైలి  వలన చాలరకాలైన ఆరోగ్య ఇబ్బందులను మనం కొని తెచ్చుకుంటున్నాం. కొన్ని పద్ధతులను మార్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Lifestyle: జీవనశైలిలో ఈ పద్ధతులు మనల్ని త్వరగా వృద్ధాప్యంలోకి నేట్టేస్తాయి.. అవేమిటో తెలుసుకోండి!
Lifestyle
Follow us
KVD Varma

|

Updated on: Nov 25, 2021 | 9:52 AM

Lifestyle: మన జీవనశైలి  వలన చాలరకాలైన ఆరోగ్య ఇబ్బందులను మనం కొని తెచ్చుకుంటున్నాం. కొన్ని పద్ధతులను మార్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా మనం నిత్యం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మనల్ని త్వరగా వృద్ధాప్యంలోకి నేట్టేస్తాయి. ఎందుకంటే, మన జీవనశైలి కొన్ని పోషకాల కొరత ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని పాడుచేసే ఇటువంటి విధానాలను తెలుసుకుని.. మన పద్ధతులు మార్చుకోవడం ద్వారా అకాల వృద్ధాప్యం, చిత్తవైకల్యం కొంత వరకు నిరోధించవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ విషయాలలో కొన్నింటిని మనం తెలుసుకుందాం.

1. విటమిన్ B12 లేకపోవడం

ఆహారంలో తగినంత విటమిన్ B12ను చేర్చడంలో వైఫల్యం మెదడు అనారోగ్యానికి దారి తీస్తుంది. జ్ఞాపకశక్తి నష్టంతో సహా వయస్సు సంబంధిత రుగ్మతలను వేగవంతం చేస్తుంది. మీరు శాఖాహారులైనా లేదా మాంసాహారులైనా, విటమిన్ బి12 తగినంత మొత్తంలో తీసుకోవడం చాలా ముఖ్యం. గొడ్డు మాంసం, చికెన్, కాలేయం, చేపలు, తక్కువ కొవ్వు పాలు, పెరుగు, చీజ్, గుడ్లు విటమిన్ B12 సమృద్ధిగా దొరికే కొన్ని ఆహారపదార్ధాలు.

2. సామాజిక ఒంటరితనం

సామాజిక ఒంటరితనం ఆందోళన,ఒత్తిడిని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం, సామాజిక విషయాలలో పరస్పర చర్య శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అందువల్ల అందరితో కలిసి మెలిసి ఉండడం.. పదిమందితోనూ తరుచూ కలిసి మనసు విప్పి మాట్లాడటం.. హాయిగా మనసారా నవ్వడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విషయాలుగా తెలుసుకోవాలి.

3. నిద్రలేమి

సరైన నిద్ర లేకపోవడం వల్ల అలసట పెరుగుతుంది. మెదడుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. నిద్రలో, నాడీ కణాల మధ్య న్యూరోట్రాన్స్మిటర్లు విశ్రాంతి తీసుకుంటాయి. ఇది మెదడు మరుసటి రోజు కొత్త మేల్కొలుపుతో ఆహ్లాదంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు వేగంగా వృద్ధాప్యానికి దారితీస్తుంది.

4. గుండె ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటారు

మన గుండె ఏ వయసులోనైనా తేలికగా తీసుకోవలసిన అవయవం కాదు. బలహీన గుండె ఆరోగ్యం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. చిత్తవైకల్యం ఆవిర్భావాన్ని సులభతరం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అధిక రక్తపోటు, మధుమేహం, వాపు వంటి సమస్యలు మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి.

5. జీవనశైలిలో సోమరితనం..

తగినంత వ్యాయామం.. శారీరక శ్రమ లేకుండా సోమరి జీవనశైలిని అనుసరించడం వల్ల మెదడు కూడా మందగిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరమే కాదు మనసు కూడా షార్ప్‌గా ఉంటుంది. వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. రోజూ 30-40 నిమిషాల పాటు వ్యాయామం చేసి, ప్రాణాయామం చేయడం వల్ల మెదడు యవ్వనంగా ఉంటుంది.

6. అతిగా మద్యం సేవించడం

అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయం, గుండె దెబ్బతినడమే కాదు. మెదడుకు కూడా హానికరం. ఆల్కహాల్ మెదడు క్షీణతకు దారితీస్తుంది. ఇది మెదడు కణాలను నాశనం చేస్తుంది. చిత్తవైకల్యానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..

Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!

Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!