Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!

వాతావరణ కాలుష్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బయటకు వెళితే మనం పీల్చే గాలి నాణ్యతపై నియంత్రణ మన చేతిలో ఉండదు. అయితే, ఇంటిలోపలి వాతావరణాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు.

Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!
Air Purifiers For Home
Follow us
KVD Varma

|

Updated on: Nov 25, 2021 | 9:09 AM

Air Purifiers for home: వాతావరణ కాలుష్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బయటకు వెళితే మనం పీల్చే గాలి నాణ్యతపై నియంత్రణ మన చేతిలో ఉండదు. అయితే, ఇంటిలోపలి వాతావరణాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇంటిలో గాలి నాణ్యతను ఇప్పుడు సులభంగా మనం నియంత్రించవచ్చు. దానికోసం మనం ఎయిర్ ప్యూరిఫైయర్స్ ను ఉపయోగించవచ్చు. ఇంటిలో ఉపయోగించే వీలున్న ఎయిర్ ప్యూరిఫైయర్స్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఏ విధమైన ఫిల్టర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు వంటి అనేక అంశాలను తెలుసుకోవాలి. ఫిల్టర్ ఎంత పెద్దది, ఫిల్టర్ ఏ గ్రేడ్? వంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా నాణ్యత కలిగిన ఎయిర్ ఫ్యూరిపైయార్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎయిర్ ప్యూరిపైయర్స్ గురించి తెలుసుకుందాం..

1. ఫిలిప్స్ సిరీస్ 1000

ఫిలిప్స్ సిరీస్ 1000 ఎయిర్ ప్యూరిఫైయర్‌ల గురించి చూస్తె ఇవి చాలా మంచివి అదేవిధంగా పోర్టబుల్ గా కూడా ఉంటాయి. ఇది మీ గదిలోని బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడమే కాకుండా, నానో ప్రొటెక్ట్ ప్రో (HEPA) ఫిల్టర్ సహాయంతో PM2.5 కాలుష్య కారకాలు, హానికరమైన వాయువులను కూడా ఫిల్టర్ చేస్తుంది. స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ 677 చదరపు అడుగుల పరిధి వరకు గాలిని శుద్ధి చేయగలదు. అలాగే, ఇది రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తూనే ఉంటుంది. దీని ధర దాదాపు 11,995 రూపాయలు.

2. సాంసంగ్ (Samsung) AX40K

ఇప్పుడు సాంసంగ్ (Samsung) AX40K ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిలిప్స్ కాంటే కొద్దిగా ఖరీదైనది. దీని ధర రూ.13,999. ఈ AX40K ప్యూరిపైయర్ 420 చదరపు అడుగుల పరిధిని కలిగి ఉంటుంది. దీనితో ఇది 420 చదరపు అడుగుల విస్తీర్ణంలోని గాలిని శుద్ధి చేయగలదు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ పిల్లల గది, స్టడీ రూమ్ లేదా ఏదైనా చిన్న పడకగదికి సరైనది. సాంసంగ్AX40K ట్రిపుల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని కారణంగా గది గాలిని మూడుసార్లు ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే విడుదల చేస్తుంది. దీని వల్ల కాలుష్య కారకాలు, హానికరమైన వాయువులు, 99.7% బ్యాక్టీరియా, వైరస్‌లు తొలగిపోతాయి. మీకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.

3. బ్లూఎయిర్ బ్లూ ప్యూర్

మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉంటే, బ్లూఎయిర్ బ్లూ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. 21,000 రూపాయల ధర కలిగిన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది అత్యంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇందులోని మోటారు చాలా తక్కువ శబ్దం చేస్తుంది. గాలి శుద్ధి విషయంలో కూడా పోటీ కంపెనీల ఫ్యూరిఫైయర్ కంటే ఇది చాలా ముందుంది. ఇది గదిలోని గాలిని గంటలో 5 సార్లు శుద్ధి చేస్తుంది. దీని పరిధి 540 చదరపు అడుగులు. దీని కారణంగా ఇది మీ బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌కి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్.