Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..
మనలో చాలా మంది బరువు తగ్గాలి అని అనుకోగానే, తిండి మానేయడమో.. ఇష్టమైన ఆహార పదార్ధాలను పూర్తిగా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. దీని వలన కడుపు మాడుతుంది తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు.
Weight Loss: మనలో చాలా మంది బరువు తగ్గాలి అని అనుకోగానే, తిండి మానేయడమో.. ఇష్టమైన ఆహార పదార్ధాలను పూర్తిగా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. దీని వలన కడుపు మాడుతుంది తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే, ఒక్క తిండి మానేసినంత మాత్రాన బరువు తగ్గిపోరు. ఈ విషయాన్ని నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. మనం బరువు తగ్గాలంటే దానికోసం కొన్ని ప్రత్యెక పద్ధతులు పాటించాలి. ఆ పద్ధతుల్లో ఆహారాన్ని నియంత్రించడం ఒక భాగం. అంతేకానీ, ఆహారం పూర్తిగా మానేయడం కాదని వారు చెబుతున్నారు.నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మీరు కోరుకున్న బరువును సాధించడానికి మూడు అంశాలను గమనించాలి. ప్రముఖ ఫిట్ నెస్ సలహాదారు అజ్రాఖాన్ ఈ విషయంపై ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. డైటింగ్ లేకుండా బరువు తగ్గే మూడు మార్గాలను ఈ వీడియోలో వివరించారు.
ముందుగా ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదిలివేయకుండా తక్కువ కేలరీల ఆహారాల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆ వీడియోలో అజ్రాఖాన్ సూచించారు.
అజ్రాఖాన్ వీడియోలో ఇచ్చిన సలహాలు ఇవే..
1. బరువు శిక్షణ
బరువు తగ్గడానికి ఉత్తమ మార్గాలలో బరువు శిక్షణ ఒకటి. ఇవి కండరాలు, కీళ్లకు పోషణనిస్తాయి. జీవక్రియను పెంచి తద్వారా శరీరంలోని కండరాలను బలపరుస్తుంది.
2. అడపాదడపా ఉపవాసం
ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే వారికి అడపాదడపా ఉపవాసం చాలా ముఖ్యం. అడపాదడపా ఉపవాసం అంటే ఒక పూట భోజనం చేయకపోవడం. సరైన సమయంలో భోజనం చేయడం లేదా భోజనానికి ప్రత్యామ్నాయంగా వేరేవిధమైన ఆహరం తీసుకోవడం. ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి సమయం కేటాయించడమే దీని లక్ష్యం. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
3. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం
ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అజ్రా సూచిస్తున్నారు. ఆమె చెబుతున్న దాని ప్రకారం ఇది చాలా కాలం పాటు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజుకు ఎక్కువ భోజనం తినకుండా ఉండటానికి మీకు సహాయపడుతుంది.
మరింత వివరంగా తెలుసుకోవడానికి అజ్రాఖాన్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి: International Airport: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.. ఎక్కడంటే..
Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..