International Airport: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.. ఎక్కడంటే..

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (జేవార్ ఎయిర్‌పోర్ట్) నవంబర్ 25న శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ ఆరోజు విమానాశ్రయ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు.

International Airport: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.. ఎక్కడంటే..
Noida International Airport Model
Follow us
KVD Varma

|

Updated on: Nov 23, 2021 | 8:11 PM

International Airport: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (జేవార్ ఎయిర్‌పోర్ట్) నవంబర్ 25న శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీ ఆరోజు విమానాశ్రయ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది. దీంతో దేశంలోనే 70 కిలోమీటర్ల పరిధిలో మూడు విమానాశ్రయాలను కలిగి ఉన్న తొలి నగరంగా ఢిల్లీ అవతరిస్తుంది. వీటిలో రెండు అంతర్జాతీయంగా ఉంటాయి. ఢిల్లీ, జెవార్ కాకుండా, మూడవ విమానాశ్రయం ఘజియాబాద్ కు చెందిన హిండన్. ఇక్కడ నుండి దేశీయ విమానాలు నడుస్తాయి.

సెప్టెంబర్ 2024 నుండి విమానాలను నిలిపేదిశలో..

ఉడాన్ జేవార్ విమానాశ్రయం నిర్మాణానికి 29 వేల 650 కోట్లు ఖర్చు చేయనున్నారు. 178 విమానాలు ఏకకాలంలో ఇక్కడ నిలబడగలవు. సెప్టెంబరు 2024లో ఇక్కడి నుంచి మొదటి విమానం ఎగురుతుంది. జేవార్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఢిల్లీ నుండి నోయిడా విమానాశ్రయానికి రోజుకు సుమారు 35 వేల మంది ప్రయాణికులు మారుతారు. ఢిల్లీ విమానాశ్రయం నుండి జెవార్‌కు దూరం దాదాపు70 కి.మీ కాగా, హిండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి దాదాపు 65 కి.మీ.

ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడాదికి 60 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో ఈ సంఖ్య 10 కోట్లకు పెరగనుంది. ఢిల్లీలో విమాన రాకపోకలను నియంత్రించాలంటే 2040 నాటికి 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, ఢిల్లీ నుండి 72 కి.మీ దూరంలో ఉన్న జేవార్ పట్టణంలో నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (NIA) ఢిల్లీ విమాన ట్రాఫిక్‌ను తగ్గించడంలో సహాయకరంగా ఉంటుంది.

జేవార్ విమానాశ్రయం నిర్మాణం ఇలా..

జేవార్ విమానాశ్రయం 5845 హెక్టార్ల భూమిలో నిర్మిస్తారు. అయితే మొదటి దశలో 1334 హెక్టార్ల స్థలంలో దీన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో ఇక్కడ రెండు ప్యాసింజర్ టెర్మినళ్లు, రెండు రన్‌వేలు నిర్మించనున్నారు. తర్వాత ఇక్కడ మొత్తం ఐదు రన్‌వేలను నిర్మించనున్నారు. ఎయిర్ ట్రాఫిక్ పెరిగేకొద్దీ, మరిన్ని రన్‌వేలను నిర్మించవచ్చు. విమానాశ్రయం ప్రస్తుతం ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 2050 నాటికి 200 మిలియన్లకు పెరుగుతుందని అంచనా.

జేవార్ ఎయిర్‌పోర్ట్‌లో మొదటి సంవత్సరంలో 40 లక్షల మంది రాకపోకలు..

అంచనాల ప్రకారం ఈ విమానాశ్రయానికి మొదటి సంవత్సరంలో దాదాపు 40 లక్షల మంది ప్రయాణీకులు ఉంటారు. 2025-26లో ప్రయాణికుల సంఖ్య 70 లక్షల వరకు ఉండవచ్చు. మొదటి ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుందని అంచనా. 2044 నాటికి ప్రయాణికుల సంఖ్య దాదాపు 80 మిలియన్లుగా ఉంటుందని అంచనా.

మొదటి సంవత్సరంలో జెవార్ విమానాశ్రయం నుండి 9 విమానాలు(8 దేశీయ..1 అంతర్జాతీయ) విమానాలు ప్రారంభిస్తారు. అయితే సామర్థ్యం పూర్తయిన తర్వాత 27-27 దేశీయ-అంతర్జాతీయ విమానాలు ఢిల్లీ విమానాశ్రయం నుండి ఎగురతాయి. ఈ విమానాశ్రయం కనీసం 2030 నాటికి ఢిల్లీలా అంతర్జాతీయ రూపాన్ని సంతరించుకోగలదు.

ఇక్కడికి విమానాలు ఉంటాయి..

దేశీయ విమానాల్లో డిమాండ్‌లో 40 శాతం ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలకు వెళ్లే.. వచ్చే ప్రయాణికుల నుంచి ఉంటుంది. అందువల్ల, జెవార్ విమానాశ్రయం నుంచి మొదట 8 దేశీయ విమానాలు ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..