Immunity Boosting Foods: మారుతున్న కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఈ ఫుడ్స్ తప్పనిసరి..

వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి. వర్షాకాలం మొదలై పోయినా.. అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండ ఇప్పటికీ దంచి కొడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. దీంతో ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలంగా ఉండాలంటే..

Immunity Boosting Foods: మారుతున్న కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఈ ఫుడ్స్ తప్పనిసరి..
Immunity Boosting Foods
Follow us

|

Updated on: Jun 21, 2024 | 6:39 PM

వాతావరణంలో పరిస్థితులు మారుతున్నాయి. వర్షాకాలం మొదలై పోయినా.. అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండ ఇప్పటికీ దంచి కొడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లల ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. దీంతో ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బలంగా ఉండాలంటే.. కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. నీరసం దరి చేరకుండా యాక్టివ్‌గా ఉంచుతాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లు మీ డైట్లో ఉండాలి. ఇవి ఇమ్యూనిటీని బలపరుస్తాయి. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు పాలు:

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో కర్కుమిన్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పాలు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇందులో అనేక రాగాలైన పోషకాలు ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం పిల్లలు, పెద్దలు రాత్రి పడుకునే ముందు ఇస్తే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

బాదం:

బాదం పప్పు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ ఇ అనేది మెండుగా ఉంటుంది. బాదం పప్పు తినడం వల్ల శరీరానికే కాకుండా జుట్టు, చర్మానికి కూడా ఎంతో మంచిది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. కొవ్వులు, ప్రోటీన్ వంటివి ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ పిల్లలు, పెద్దలు బాదం పప్పు తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి వేయించిన కూరలు:

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. యాంటీ మైకోబ్రియల్, ఇమ్యూన్ బూస్టింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి.. ఎలాంటి కూరల్లో అయినా వెల్లుల్లి వేయించి వండితే రుచితో పాటు.. ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా బలపడుతుంది. ఇలా ఈ సీజన్‌ మారుతున్న విషయంలో సిట్రస్ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా ఇతర ఆహార పండ్లు తినడం కూడా మంచిదే.

పెరుగు:

మారుతున్న సీజన్‌లో పెరుగు తినడం వల్ల కూడా చాలా పోషకాలు అందుతాయి. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగులో ఏమీ కలపకుండా తింటే.. రోగాలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మీ రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
మీ రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?
హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం
హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం
భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
భారత్‌లో దుమ్మురేపుతున్న బడ్జెట్ కార్లు.. ది బెస్ట్ ఇవే..!
రామ, రావణుడితో పూజను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
రామ, రావణుడితో పూజను అందుకున్న శక్తిపీఠం ఎక్కడుందో తెలుసా..
దివిలో చంద్రునికే సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా సిజ్లింగ్ లుక్స్..
దివిలో చంద్రునికే సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా సిజ్లింగ్ లుక్స్..
మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌.!
మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌.!
గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
హెల్మెట్‌తో ఎల్‌బీడబ్ల్యూ చేయోచ్చు: రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
హెల్మెట్‌తో ఎల్‌బీడబ్ల్యూ చేయోచ్చు: రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్
ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
ఐపీఓకు ముందుకు వచ్చిన స్విగ్గీ.. రూ.3750 కోట్ల సేకరణే టార్గెట్..!
అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?
అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?