వేయించిన శనగలలో ఫైబర్, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులంటున్నారు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.