Health: కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి..? సమస్య ఉంటే ఎలాంటి పండ్లను తినకూడదు.. వైద్యుల సూచన ఇదే..
ఉరుకులు పరుగుల జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. కిడ్నీలను మానవ శరీరంలోని ఫిల్టర్ అంటారు

ఉరుకులు పరుగుల జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, శరీరంలోని కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. కిడ్నీలను మానవ శరీరంలోని ఫిల్టర్ అంటారు. ఇది శరీరంలోని మురికిని, ద్రవాలను ఫిల్టర్ చేస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించి బయటకు పంపుతుంది. ఇలా కిడ్నీలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కిడ్నీకి సంబంధించిన అత్యంత భయంకరమైన వ్యాధులలో కిడ్నీ స్టోన్స్ ఒకటి. ఎవరికైనా ఈ సమస్య ఉంటే.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.. కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినడిప్పుడు సకాలంలో స్పందించకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సకాలంలో చికత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయో తెలుసా?
సాధారణంగా, మనం ఏదైనా అనారోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు లేదా హానికరమైన ద్రవాన్ని తాగినప్పుడు.. అది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మలినాలు కాస్తా రాయిలా మారి.. పెరుగుతుంటాయి. అందువల్ల, రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్న రోగులు వారు ఏ పదార్థాలు తినాలి..? ఏమి తినకూడదు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కిడ్నీ పేషెంట్లకు పండ్లు..
సాధారణంగా మనం పండ్లను ఆరోగ్యానికి వరంగా పరిగణిస్తాం.. కానీ ప్రతి పండు అన్ని వ్యాధులకు అనుకూలమని చెప్పలేము. కిడ్నీ స్టోన్ రోగులు కొన్ని పండ్లు తినలేరు.
కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారికి అధిక నీటి శాతం కలిగిన పండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. తద్వారా శరీరంలో నీటి పరిణామం పరుగుతుంది. పుచ్చకాయ, కర్బుజా లాంటి పండ్ల వినియోగాన్ని పెంచడం ద్వారా.. కిడ్నీల సమస్య నుంచి బయటపడొచ్చు..
కిడ్నీలో రాళ్లు పెరిగినప్పుడు కాల్షియం ఎక్కువగా ఉండే పండ్లను వీలైనంత తరచుగా తీసుకోవాలి. దీని కోసం మీరు బ్లాక్‌బెర్రీ, ద్రాక్ష, కివీ వంటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
కెఫిన్: భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ రోజును ఒక కప్పు టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఇది మీకు కొంతకాలం తాజాదనాన్ని అందించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది మూత్రపిండాలకు హాని చేస్తుంది. మీరు కిడ్నీ వ్యాధిగ్రస్తులైతే దీనిని తాగకపోవడమే మంచిది
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.