వెల్లుల్లిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటల్లో వెల్లుల్లి వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అదే విధంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుతుంది.