Anupama Parameswaran: అదిరిందమ్మా అనుపమ.. పింక్ సూట్లో మతిపోగొడుతోన్న కేరళ కుట్టి..
అనుపమ పరమేశ్వరన్.. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. ఈ కేరళ కుట్టికి తెలుగులో మాత్రం విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత శర్వానంద్ జోడిగా శతమానం భవతి సినిమాలో మెరిసింది ఈ కేరళ కుట్టి. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది అనుపమ. ఈ ఏడాది కార్తీకేయ, 18 పేజెస్ సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.