High Blood Pressure Control: హైబీపీని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా.. కరివేపాకును ఇలా వాడండి!

కరివేపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని ప్రాముఖ్యత తెలుసు. కరివేపాకు కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మాన్ని, జుట్టును కూడా రక్షించుకోవచ్చు. కరివేపాకులో ఉండే గుణాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో ఎన్న రోగాలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా కరివేపాకును ఔధంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టే విధంగా ఉపయోగిస్తారు. కరివేపాకులో ముఖ్యంగా రోగ నిరోధక శక్తితో పాటు, విటమిన్స్,..

High Blood Pressure Control: హైబీపీని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా.. కరివేపాకును ఇలా వాడండి!
Curry Leaves
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2023 | 6:51 PM

కరివేపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ దీని ప్రాముఖ్యత తెలుసు. కరివేపాకు కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మాన్ని, జుట్టును కూడా రక్షించుకోవచ్చు. కరివేపాకులో ఉండే గుణాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో ఎన్న రోగాలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా కరివేపాకును ఔధంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టే విధంగా ఉపయోగిస్తారు. కరివేపాకులో ముఖ్యంగా రోగ నిరోధక శక్తితో పాటు, విటమిన్స్, మినరల్స్, పోషకాలు వంటివి ఎక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా కరివేపాకుతో గుండె సమస్యలను తగ్గించుకోవచ్చు. అధిక రక్త పోటుతో బాధ పడే వారికి కరివేపాకు బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి కరివేపాకు గుండె సమస్యలు రాకుండా ఎంత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:

కరివేపాకులో పాలీ ఫెనాల్స్, ప్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. అలాగే రక్త నాళాల వాపుని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా గుండె పనితీరుకు బాగా సహాయ పడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి.. ఇవి రక్త నాళాల్లో మంటను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

పోటాషియం ఎక్కువగా ఉంటుంది:

కరివేపాకులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త పోటును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అలాగే ఇందులో సోడియం లెవల్స్ ను కూడా ఎదుర్కొవడానికి హెల్ప్ అవుతుంది.

హైబీపీని తగ్గించడంలో కరివేపాకు ఎలా ఉపయోగించవచ్చు:

– కరివేపాకును కూరల్లో, వేపుల్లో, పచ్చళ్లు, సూప్ లు ఇలా అన్ని రకాల వాటిల్లో ఎండిన కరివేపాకులను వేసి తినాలి.

– అలాగే రైస్ ఐటెమ్స్ చేసినప్పుడు, సాంబార్, మాంసాహార వంటకాల్లో కూడా కరివేపాకును ఉపయోగించవచ్చు.

– కరివేపాకుతో టీ కూడా పెట్టుకోవచ్చు. ఎండిన కరియా లీవ్స్ ని నీటిలో మరిగించి దాన్ని వడకట్టి తాగండి. ఇలా చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ నీటిని జుట్టుకు రాసుకున్నా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి.. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.

– పచ్చి కరివేపాకును ఎండ బెట్టి, ఎండు మిర్చి, ఉఫ్పు, వెల్లుల్లి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. దీన్ని ప్రతి రోజు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తినడం వల్ల రక్త పోటు కంట్రోల్ లోకి వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.