Health: రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బీపీ లక్షణాలు కావొచ్చు..
ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, ఒత్తిడి కారణం ఏదైనా.. బీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో కాలక్రమేణ ఈ బీపీ హృద్రోగాలకు సైతం దారి తీస్తుంది. అయితే బీపీని ముందుగానే గుర్తిస్తే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల బీపీతో కలిగే దుష్ప్రభావాన్ని వీలైనంత వరకు...

మారుతోన్న జీవనశైలి కారణంగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. నిత్యం ఒత్తిడితో కూడుకున్న జీవితం, క్షణం తీరికలేకుండా పని వెరసి మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. మారిన ఈ జీవన విధానం కారణంగా వస్తోన్న ప్రధాన సమస్య రక్తపోటు. ఒకప్పుడు కనీసం 60 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్య కనిపించేదు. కానీ ప్రస్తుతం పాతికేళ్ల కుర్రాడు కూడా రక్తపోటు బారిన పడుతున్నాడు.
ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, ఒత్తిడి కారణం ఏదైనా.. బీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో కాలక్రమేణ ఈ బీపీ హృద్రోగాలకు సైతం దారి తీస్తుంది. అయితే బీపీని ముందుగానే గుర్తిస్తే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల బీపీతో కలిగే దుష్ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాల ద్వారా రక్తపోటు సమస్యను ముందుగానే గుర్తించొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..
* ఛాతి నొప్పి గుండె సమస్యకు ప్రధాన లక్షణంగా భావిస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో రాత్రిపూట ఛానినొప్పి వస్తుంటే మాత్రం రక్తపోటుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఛాతినొప్పి క్రమంతప్పకుండా ఒకే వైపు వస్తే అది బీపీకి లక్షణంగా భావించాలని సూచిస్తున్నారు. వెంటనే బీపీ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
* ఇక రాత్రి పడుకున్న తర్వాత తరచుగా మూత్ర విసర్జన వస్తున్నా బీపీకి లక్షణంగా భావించాలి. సహజంగా షుగర్ ఉన్న వారికే తరచుగా మూత్ర విసర్జన వస్తుంది. అయితే బీపీ కారణంగా రక్త నాళాలపై ఒత్తడి పెరగడం, మూత్రపిండాలపై ప్రభావం పడడం ద్వారా తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి కారణం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా అధిక రక్తపోటు లక్షణంగా భావించాలని చెబుతున్నారు.
* ఇక నిద్రలేమి కూడా రక్తపోటు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇటీవల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నా, ఇది ఎక్కువ రోజులు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి, ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం ఉత్తమం.
* ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా నిత్యం అలసిపోతున్నా, నిత్యం బలహీనంగా ఉన్నట్లు అనిపించినా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావించాలి. ఈ సమస్యను ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే గుండె పనితీరుపై ప్రభావం పడడంతో పాఉట కంటి చూపు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
* సుదీర్ఘ కాలంగా మెడలు నొప్పితో బాధపడుతున్నా అధికరక్తపోటుకు చిహ్నంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. మెడ నొప్పిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. రెండు రోజులకు మించి మెడ నొప్పులు ఉంటే వెంటే వైద్యులను సంప్రదించి, బీపీ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడమే సూచించదగ్గ అంశం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




