AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Decor Tips: పాత కూలర్ ని కొత్తగా ఈ చిన్న చిట్కాలతో మార్చేయండి!

ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా సాధారణంగా కూలర్లు అనేవి ఉంటాయి. ఇది కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. వేసవి కాలంలో ఇవి లేకపోతే పని అవ్వదు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కూలర్లు బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్నేళ్ల పాటు వీటిని వాడిన తర్వాత.. పక్కకు పడేసి.. కొత్త వాటిని తీసుకుంటూ ఉంటారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. వేసవి కాలం ఉన్నంత వరకూ కూలర్స్ ని ఉపయోగించి..

Home Decor Tips: పాత కూలర్ ని కొత్తగా ఈ చిన్న చిట్కాలతో మార్చేయండి!
Cooler
Chinni Enni
|

Updated on: Oct 18, 2023 | 6:15 PM

Share

ఇప్పుడు ఎవరి ఇంట్లోనైనా సాధారణంగా కూలర్లు అనేవి ఉంటాయి. ఇది కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. వేసవి కాలంలో ఇవి లేకపోతే పని అవ్వదు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కూలర్లు బాగా వర్క్ అవుతాయి. అయితే కొన్నేళ్ల పాటు వీటిని వాడిన తర్వాత.. పక్కకు పడేసి.. కొత్త వాటిని తీసుకుంటూ ఉంటారు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. వేసవి కాలం ఉన్నంత వరకూ కూలర్స్ ని ఉపయోగించి.. ఆ తర్వాత పక్కకు పడేస్తూంటారు. ఇలా చేయడం వల్ల కూలర్ పార్ట్స్ పాడవుతాయి. దీంతో కొత్తవి కొనాలని భావిస్తూంటారు. దీంతో పాత కూలర్స్ ని పక్కకు పెట్టేస్తూంటారు. కానీ కూలర్ల వినియోగం అయినపోయిన తర్వాత కానీ.. ముందు కానీ.. చిన్న చిట్కాలతో శుభ్ర పరుచుకుని, క్లీన్ చేసుకుంటే.. కొత్తవి కొనాల్సిన అవసరం. పాత వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి? ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చల్లని గడ్డి:

కూలర్స్ లో ఉండే చల్లని గడ్డి వల్లనే అసలైన చల్లదనం వస్తుంది. అంతే కాకుండా వాటిపై దుమ్మూ, ధూళి అనేవి బాగా పేరుకుపోతాయి. ఇలా వాటి నుంచి వచ్చిన గాలి పీల్చడం వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. గాలి కూడా రావడం తగ్గిపోతుంది. దుర్వాసన కూడా వస్తూంటాయి. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే.. వీలైనప్పుడల్లా గడ్డిని మార్చుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

కూలర్ ఫ్యాన్ రన్నింగ్:

కూలర్ ఫ్యాన్ కూడా ఎక్కువ కాలం రావాలంటే.. అప్పుడప్పుడు దాన్ని శుభ్రం చేయాలి. అలాగే ఎక్కువ కాలం కూలర్ వాడకుండా ఉంటే.. ఆ ఫ్యాన్ సరిగ్గా పని చేయదు. కాబట్టి మీరు వాడుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. కూలర్ లో ఫ్యాన్ పాడైతే.. ఇవి మార్కెట్లో అతి తక్కువ ధరకే దొరుకుతాయి. తీసుకొచ్చి బిగించండి.

నీరు కారడం:

సాధారణంగా కూలర్స్ లో ఉండే అతి పెద్ద సమస్య ఏంటంటే.. నీరు కారడం. అప్పుడప్పుడు కూలర్స్ నుంచి వాటర్ లీకేజీ అవుతుంది. ఇలాంటప్పుడు ఈ వాటర్ లీకేజీ ఆపేందుకు ఎమ్ – సీల్ సహాయం తీసుకోవచ్చు.

కొత్తగా కనిపించాలంటే పెయింట్ వేయండి:

పాత కూలర్ ని శుభ్రం చేశాక.. కొత్త దానిలా కనిపించాలంటే పెయింట్ వేయండి. ఇలా చేయడం వల్ల కొద్ద తానిలా కూలర్ మెరిసి పోతుంది. అంతే కాకుండా దాని క్వాలిటీ కూడా పెరుగుతుంది. దీంతో ఇంకా పెయింట్ ఎక్కువ కాలం మన్నుతుంది.

ఇలా చిన్న చిన్న చిట్కాలతో పాత కూలర్స్ ని శుభ్రం చేసుకుంటే కొత్త వాటిలా మారతాయి. డబ్బు కూడా ఆదా అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
డిస్‌ప్లే టెక్నాలజీతోనే క్రేజ్ క్రియేట్ చేస్తున్న టీసీఎల్‌
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
పబ్లిక్ టాయిలెట్ తలుపుల కింద ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
బ్యాంకులో పెట్టిన బంగారం చోరీకి గురైతే పరిహారం ఎంత వస్తుంది?
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
అప్పుడు జబర్దస్త్ కమెడియన్.. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్..
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
బీపీని 24 గంటలు టెస్ట్ చేసే స్మార్ట్‌వాచ్ కావాలా?
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి..ఆరోగ్యానికి బోలెడన్ని
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే