Heart: మీ గుండె పదిలమేనా.? ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి..
అయితే గుండె ఆరోగ్యాన్ని పరీక్షించాలంటే వెంటనే గుర్తొచ్చేది ఈసీజీ, ఎకో స్కాన్ వంటివి. ఈ పరీక్షలు చేయించుకోవాలంటే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అంశం. దీంతో చాలా మంది గుండె పరీక్షను చేయించుకోవడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఆసుపత్రికి వెళ్లకుండానే ఇంట్లో మీ గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని...
ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుతో మరణించడం నిపుణులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నపలంగా కుప్పకూలి పోతున్నారు. చిట్టి గుండె లయ తప్పడం ఇటీవల ఎక్కువుతోంది. అయితే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మంచి జీవన శైలిని పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే గుండె ఆరోగ్యాన్ని పరీక్షించాలంటే వెంటనే గుర్తొచ్చేది ఈసీజీ, ఎకో స్కాన్ వంటివి. ఈ పరీక్షలు చేయించుకోవాలంటే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అంశం. దీంతో చాలా మంది గుండె పరీక్షను చేయించుకోవడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఆసుపత్రికి వెళ్లకుండానే ఇంట్లో మీ గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ గుండె ఆరోగ్యాన్ని ఎలా పరీక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒకటిన్నర నిమిషాల వ్యవధిలో 40 మెట్లు ఎక్కగలిగితే మీ గుండె పూర్తి ఆరోగ్యంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, తీవ్ర స్థాయిలో ఆయాసం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని అర్థం చేసుకోవాలి. గుండెపై ఒత్తిడి పడడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందన పెరుగుతుంది.
* అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం గుండె ఆరోగ్యంగా ఉందో లేదో.. నడుము సైజ్ ఆధారంగా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఓ అంచనా ప్రకారం పురుషుని నడుము పరిమాణం 37 అంగుళాలు, స్త్రీ నడుము పరిమాణం 31.5 అంగుళాలు ఉండటం బలహీనమైన గుండెకు సంకేతమని చెబుతున్నారు. పురుషుల్లో 40 అంగుళాలు, మహిళల్లో 35 అంగుళాలు ఉంటే స్థూల కాయంతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.
* హృదయ స్పందన రేటు ఆధారంగా కూడా గుండె ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చు. హార్ట్ బీట్‌ను లెక్కించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా నిర్ణయించవచ్చు. దీని ద్వారా గుండె సిరల్లో ఏదైనా అడ్డంకులు ఉన్నాయో లేదో తెలుస్తుంది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం సాధారణ పనులు చేస్తున్న సమయంలో పల్స్ ఒక నిమిషంలో 60 నుంచి 100 బీట్స్ ఉండాలని చెబుతున్నారు. తక్కువ హృదయ స్పందన ఉన్న వారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..