AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: సబ్బుకు బదులు ఇవి ఉపయోగించండి.. మీ ముఖం నిగనిగలాడుతుంది

ముఖం కడుక్కోవడానికి సబ్సును ఉపయోగిస్తాం ఇది సర్వసాధారణమై విషయం అయితే కొందరు సబ్బులతో పాటు ఫేస్‌ వాష్‌లను సైతం ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ ముఖంపై ఎంతొ కొంత ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి సహజమైన వస్తువులను ఉపయోగిస్తేనే మరింత మేలు జరుగుతుందని సూచిస్తుంటారు....

Lifestyle: సబ్బుకు బదులు ఇవి ఉపయోగించండి.. మీ ముఖం నిగనిగలాడుతుంది
Skin
Narender Vaitla
|

Updated on: Apr 14, 2024 | 9:00 PM

Share

ముఖం కడుక్కోవడానికి సబ్సును ఉపయోగిస్తాం ఇది సర్వసాధారణమై విషయం అయితే కొందరు సబ్బులతో పాటు ఫేస్‌ వాష్‌లను సైతం ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ ముఖంపై ఎంతొ కొంత ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి సహజమైన వస్తువులను ఉపయోగిస్తేనే మరింత మేలు జరుగుతుందని సూచిస్తుంటారు. మరి ముఖాన్ని సబ్బుకు బదులు ఉపయోగించాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* శనగపిండి సహజమైన క్లెన్సర్‌గా చెబుతుంటారు. ఇప్పటికే మన పెద్దవాళ్లు శనగపిండిని ఉపయోగిస్తుంటారు. ఇది ఇది చర్మం నుంచి ఆయిల్‌ను సహజంగా తొలగిస్తుంది. ఇందుకోసం పెరుగు లేదా పాలలో ఒక టేబుల్ స్పూన్‌ శనగపిండిని కలిపి పేస్ట్‌లాగా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ముఖం నిగనిగలాడుతుంది.

* ఇక బియ్యం పిండి కూడా ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్‌ బియ్యం పిండిని నీళ్లలో లేదా పాలలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

* ఇక పెరుగు కూడా ముఖాన్ని సహజంగా రక్షిస్తుంది. ఇందుకోసం పెరుగును ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్‌ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

* పాటు ముఖాన్ని మెరిసేలా చేయడంలో ముల్తానీ మిట్టి ఎంతగానో సహకరిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ లో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

* అలోవెరా జెల్ ముఖ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి జెల్ అప్లై చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా స్మూత్‌గా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. కొందరికీ వీటితో స్కిన్‌ అలర్జీ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే వైద్యులను సంప్రదించిన తర్వాత వీటిని ఉపయోగించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి