Lifestyle: ఏలకులతో మొటిమలు మటుయాం.. ఎలాగో తెలుసా.?
ప్రతీ ఒక్కరి వంటగదిలో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ఏలకులు ఒకటి. వంటకానికి రుచిని పెంచే ఏలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఔషధ గుణాలకు ఏలకులు పెట్టింది పేరు. అయితే కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ముఖ అందానికి కూడా ఏలకులు ఉపయోగపడతాయని మీకు తెలుసా.?

ప్రతీ ఒక్కరి వంటగదిలో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ఏలకులు ఒకటి. వంటకానికి రుచిని పెంచే ఏలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఔషధ గుణాలకు ఏలకులు పెట్టింది పేరు. అయితే కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ముఖ అందానికి కూడా ఏలకులు ఉపయోగపడతాయని మీకు తెలుసా.? ఏలకులతో ముఖం అందాన్ని పెంచుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఏలకులు సహాయంతో మొటిమలు, మచ్చలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం 2 నుంచి 3 ఏలకులను మెత్తగా మెత్తగా పొడి చేయాలి. అనంతరం ఈ పౌడర్‌లో ఒక చెంచా తేనె, కొంచెం పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి. మొటిమలు, మచ్చలు తగ్గడం మీరే గమనిస్తారు.
* ఒక చెంచా యాలకుల పొడిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే మార్పు ఉంటుంది. ఇక 1, 2 యాలకులు గ్రైండ్ చేసి పౌడర్‌గా చేసి, ఆపై ఈ పొడిలో శెనగపిండి, కొంచెం నీరు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టును ముఖంపై 20 నిమిషాలు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి, ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ముఖం నిగనిగలాడుతుంది.
* అలాగే.. 2 నుంచి 3 ఏలకులను నీటిలో వేసి మరిగించి, ఈ నీటిని చల్లార్చి వాటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపుకొని, అప్పుడప్పుడు ముఖంపై స్ప్రే చేసుకోవాలి. అలాగే ఏలకులను టీలాగా చేసుకొని తాగినా మంచి ఫలితాలు లభిస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొందరిలో ఇలా చేయడం వల్ల స్కిన్ సంబంధిత సమస్యుల వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గుర్తించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




