Barley Grass Health Benefits: బార్లీ గడ్డి రసం ఎప్పుడైనా తాగారా? దాని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు..
కేవలం బార్లీ గింజలు మాత్రమే కాదు.. బార్లీ గడ్డి కూడా ఔషధ గుణాలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. బార్లీ గడ్డిని రసం చేసుకొనే తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని, అలాగే వెయిట్ లాస్ కు కూడా బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

బార్లీ నీళ్లు చాలా మందికి పరిచయమే. దాని ద్వారా శరీరానికి చలువు చేస్తుందని చాలా మంది చెబుతారు. బాగా వేడిచేసిందని ఎవరైనా అంటే బార్లీ నీరు తాగమని సలహాలు కూడా ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కేవలం బార్లీ గింజలు మాత్రమే కాదు.. బార్లీ గడ్డి కూడా ఔషధ గుణాలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. బార్లీ గడ్డిని రసం చేసుకొనే తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని, అలాగే వెయిట్ లాస్ కు కూడా బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. బార్లీ గడ్డి రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు , మొక్కల సమ్మేళనాలు, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయని చెబుతున్నారు.
రసం ఎలా చేస్తారు..
బార్లీ గడ్డి రసం తయారు చేయడానికి బార్లీ మొక్కను తీసుకొని దాని ఆకులను సేకరించి రసంగా చేసుకోవాలి. లేదా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎండిన తర్వాత కూడా రసంగా చేసుకోవచ్చు. ఈ గడ్డి బార్లీ గింజలు ఏర్పడకముందు లభ్యమవుతుంది. నిపుణుల చెబుతున్న దాని ప్రకారం బార్లీ గడ్డి రసం డైట్ చేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం రండి..
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, కాలుష్యం, ఇతర పర్యావరణ కారకాల వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిళ్లు, ఇతర ఫ్రీ రాడికల్ నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ పనిలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గడంలో.. బార్లీ గడ్డిలో కేలరీలతో పాటు ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఇది రోజూ తీసుకోవచ్చు.
రక్తంలో చక్కెర నియంత్రణ.. తక్కువ గ్లైసెమిక్ సూచికతో, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సక్రమంగా ఉండేలా చేస్తుంది. బార్లీ గడ్డి రసంలో ఉండే డైటరీ ఫైబర్‌లు రక్తంలో క్రమపరుస్తుంది. .
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కంటెంట్.. బార్లీ గడ్డి రసంలో విటమిన్ సి, డైటరీ ఫైబర్స్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి, ఇవి ఆర్థరైటిస్ , రుమాటిజం, ఆస్తమా, గౌట్స్ వంటి ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితులను తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.. విటమిన్ సి, విటమిన్ ఎ, బార్లీ గడ్డి రసంలోని ఫైటోన్యూట్రియెంట్స్ వంటి ఇతర సమ్మేళనాలు మన జీర్ణవ్యవస్థను ఫ్రీ రాడికల్ నుంచి కాపాడతాయి. ఇందులోని భేదిమందు లక్షణాలు ప్రేగు కదలికలను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి ఇతర గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందుతాయి.
రోగనిరోధక వ్యవస్థకు ఊతం.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల బార్లీ గడ్డి రసం బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
మితంగా ఉండాలి..
బార్లీ గడ్డి రసం మితంగా ఉపయోగించాలి. అతిగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది వ్యక్తులకు అలెర్జీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా కొంతమందిలో ఉబ్బరం లేదా గ్యాస్‌కు కారణం కూడా కావచ్చు. తక్కువ మొత్తంలో తీసుకోవడం ప్రారంభించి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు అని నిర్ధారించుకున్నాక డైట్ లోకి తీసుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



