Travel Guide: చిరు జల్లుల సందడి మధ్య చిల్ అవ్వాలని ఉందా.. ప్రశాంతతకు మారుపేరైనా ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిందే..
కొండలు కోనలు, పచ్చని చెట్ల మధ్య రిసార్టుల్లో మీ ప్రియమైన వారితో ప్రశాంతంగా గడిపితే ఆ అనుభవం వర్ణనాతీతం. జాబ్ టెన్షన్లు, సిటీ రణగోణ ధ్వనులకు దూరంగా అలాంటి టూర్ ప్లాన్ లో మీరుంటే ఈ కథనాన్ని మిస్ అవ్వొద్దు.

వేసవిలో ఎండలకు జడిసి ఎక్కడికీ టూర్ ప్లాన్ చేసుకోకపోతే.. ఈ మాన్ సూన్ సీజన్ లో మంచి టూర్ ప్లాన్ చేసుకోండి. కరిమబ్బుల నీడలో తొలకరి సవ్వడుల మధ్య ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ.. మంచి మిర్చి బజ్జి తింటే ఆ అనుభవం ఎంత బావుంటుందో కదా. అదే సమయంలో చిత్తడి నేలలో పచ్చని చెట్ల మధ్య ఓ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ వాక్ చేస్తే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. కొండలు కోనలు, పచ్చని చెట్ల మధ్య రిసార్టుల్లో మీ ప్రియమైన వారితో ప్రశాంతంగా గడిపితే ఆ అనుభవం వర్ణనాతీతం. జాబ్ టెన్షన్లు, సిటీ రణగోణ ధ్వనులకు దూరంగా అలాంటి టూర్ ప్లాన్ లో మీరుంటే ఈ కథనాన్ని మిస్ అవ్వొద్దు. అటువంటి మాన్ సూన్ టూరిస్ట్ డెస్టినేషన్స్ మీకోసం అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి..
స్పైస్ విలేజ్, తెక్కడి, కేరళ..

Spice Village, Thekkady, Kerala
తెక్కడి అనే ప్రాంతం ప్రశాంతతకు చిరునామా. సుందరమైన కొండల మధ్య, పచ్చని చెట్లు, తోటలు ఆకర్షిస్తాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 19-25 డిగ్రీల మధ్య ఉంటుంది, వర్షపు జల్లులు ప్రకృతి దృశ్యాన్ని మరింత రమణీయంగా తీర్చిదిద్దుతాయి. ఈ మాన్ సూన్ సీజన్ లో చూడదగిన ప్రాంతం. స్పైస్ విలేజ్ లో స్వదేశీ మనన్ తెగ సంప్రదాయ నివాసాలు, గిరిజన కళలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి.
విశాలం, కనడుగథన్ (చెట్టినాడ్), చెన్నై..

Visalam, Kanadugathan (chettinad), Chennai
మానవ నిర్మితాల్లో ఓ అద్భుతం ఈ విశాలం అనే కట్టడం. చెన్నైకి సమీపంలోని చెట్టియార్స్ వద్ద కనడుగథన్ నడిబొడ్డున ఇది ఉంది. మీరు తరచూ తేలికపాటి వర్షాలను ఇష్టపడితే ఇదే మీకు సరైన గమ్యస్థానం. కేవీఏఎల్ రామనాథన్ చెట్టియార్ తన ప్రియమైన పెద్ద కుమార్తె విశాలాక్షి కోసం ప్రేమగా రూపొందించిన 19వ శతాబ్దపు హెరిటేజ్ హోమే ఈ విశాలం. కుటుంబ సమావేశాలకు బెస్ట్ చాయిస్. విశాలమైన ప్రాంగణం అలంకృత స్తంభాలు, సున్నితమైన పాలరాతి అందాలు, ఐరోపా, ఆగ్నేయాసియా నుంచి తీసుకొచ్చిన గాజు కిటికీలను కలిగి ఉన్న రాజభవనం ఈ విశాలం. అలసిపోయిన ప్రాణాలకు ఈ విశాలంలోని కొలను మంచి అనుభూతినిస్తుంది. మీరు ఈ వర్షాకాలంలో మంచి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. దీనిలో బస చేసేందుకు మొగ్గుచూపండి.
జెహన్ నుమా రిట్రీట్, భోపాల్, మధ్యప్రదేశ్..

Jehan Numa Retreat, Bhopal, Madhya Pradesh
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న జెహాన్ నుమా రిట్రీట్ వర్షాకాలంలో సందర్శంచదగిన మరో ఉత్తమ ప్రాంతం. మన దేశంలో చాలా తక్కువ మందికి తెలియని అత్యుత్తమ టూరిస్ట్ స్పాట్ ఇది. ఉత్తర భారతదేశంలోని మైదానాల కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతం మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దంపతులుగా ఓ రోమాంటిక్ గేట్ వే కావాలనుకొంటే.. లేదా ఫ్యామిలీతో ప్రశాంతతను కోరుకునే వారికి ఇది బెస్ట్ స్పాట్.
ఫజ్లానీ నేచర్ నెస్ట్, లోనావాలా సమీపంలో, మహారాష్ట్ర..

Fazlani Nature’s Nest, Near Lonavala, Maharashtra
మహారాష్ట్రలోని లోనావాలా అనే సుందరమైన పట్టణానికి సమీపంలో ఉన్న ఫజ్లానీ నేచర్స్ నెస్ట్ పశ్చిమ కనుమలలోని విస్మయపరిచే పర్వతాల మధ్య అద్భుతమైన అనుభూతినిస్తుంది. వైవిధ్యమైన వృక్ష, జంతుజాలంతో నిండిన ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.
కోకోనట్ లగూన్, కుమరకోమ్, కేరళ..

Coconut Lagoon, Kumarakom, Kerala
కేరళలోని కుమరకోమ్‌లో ఉన్న కోకోనట్ లగూన్ కూడా ప్రకృతి స్వర్గ ధామం. ఇక్కడి కొబ్బరి చెట్లు, చెక్క వంతెనలు అబ్బురపరుస్తాయి. ఇక్క పాత-కేరళ బంగ్లాలు లేదా విల్లాలు ఉన్నాయి. ఈ మాన్ సూన్ సీజన్ కి బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



