Health: శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..

శరీరంలో జీవక్రియలు సక్రమంగా పనిచేయడంలో విటమిన్ బీ12 కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అయితే శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే శరీరంలో ఈ విటమిన్ లోపాన్ని కొన్ని సంకేతాల ఆధారంగా గుర్తించవచ్చు. ఇంతకీ శరీరం ఇచ్చే ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..
Vitamin B12
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 28, 2024 | 6:45 PM

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందాలి. శరీరంలో విటమిన్లు లోపిస్తే వెంటనే శరీరం మనల్ని అలర్ట్‌ చేస్తుంది. శరీరంలో కీలక పాత్ర పోషించే వాటిలో విటమిన్‌ బీ12 ఒకటి. మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడంలో బిటమిన్‌ బీ12 కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచడంలో బీ12 ఉపయోగపడుతుంది. శరీరంలో విటమిన్‌ బీ12 లోపాన్ని తెలిపే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* విటమిన్‌ బీ12 లోపం వల్ల రక్తహీనతకు దారి తీస్తుంది. విటమిన్ బి-12 లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనతకు గురవుతారు. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఎర్ర రక్తకణాల వృద్ధి చెందుతాయి.

* వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం సర్వసాధారణమైన సమస్య. అయితే విటమిన్‌ బీ12 లోపం వల్ల యువతలో కూడా ఈ సమస్య వస్తుంది. విటమిన్ B12 లోపం మెదడును ప్రభావితం చేస్తుంది. ఇది అనేక మానసిక వ్యాధులకు దారితీస్తుంది. విటమిన్ B12 లోపం ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, చిత్తవైకల్యానికి దారి తీస్తుంది .

* శరీరంలో విటమిన్‌ 12 లోపిస్తే ఎముకల నొప్పి వస్తుంది. ముఖ్యంగా యువతలో వెన్ను నొప్పి వేధిస్తుంటే విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు.

* జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తున్నా విటమిన్‌ బీ12 లోపం ఉందని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలు వెంటాడుతుంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* చర్మం సంబంధిత సమస్యలకు కూడా విటమిన్‌ బీ12 దారి తీస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. స్కిన్‌ అలర్జీ వేధిస్తుంటాయి. అలాగే జుట్టు రాలిపోతుంది. కొంత మందికి గోళ్లకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి.

* ఎలాంటి పనిచేయకపోయినా.. త్వరగా అలసిపోతుంటే విటమిన్‌ బీ12తో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే కాళ్లు, చేతుల్లో జలదరింపు వంటి సమస్యలు కనిపిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!