Heart: ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..

ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని తెలిసిందే. అయితే రెండు రకాల సమస్యలతో బాధపడేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటయాని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Heart: ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
Heart Attack
Follow us

|

Updated on: Oct 28, 2024 | 7:13 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం ఏదైనా ఇటీవల గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండె పోటు బారిన పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రక్తపోటు ఉన్న వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. అయితే రక్తపోటుతో పాటు డయాబెటిస్‌ ఉన్న వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గుండెకు సరిగ్గా రక్తం పంపింగ్ కానీ సమయంలోనే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందనే విషయం తెలిసిందే. గుండె జబ్బులు రావడానికి రక్తపోటుతో పాటు మధుమేహం కూడా ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. గుండెపోటుతో మరణించిన వారిలో మూడొంతుల మంది అప్పటికే బీపీతో బాధపడుతున్నారని తేలింది. వైద్యుల ప్రకారం.. సాధారణ రక్తపోటు ఉన్నవారితో పోలిస్తే అధిక రక్తపోటు ఉన్న రోగులలో గుండె ఆగిపోయే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

గుండె వైఫల్యానికి ఆల్కహాల్‌, స్మోకింగ్ వంటివి ప్రధానకారణమని నిపుణులు అంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం, విపరీతమైన దగ్గు, అలసట, వికారం, ఆకలి తగ్గడం, హృదయ స్పందన రేటులో ఆకస్మిక మార్పులు వంటివన్నీ గుండె సంబంధిత సమస్యలకు ప్రాథమిక లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు పెరగడానికి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు పచ్చళ్లతో పాటు ప్యాక్‌ చేసిన ఆహారంలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటివి రక్తపోటుకు దారి తీస్తుంది. 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం కచ్చితంగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. రోజు కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయాలి. స్మోకింగ్, డ్రింకింగ్‌ను పూర్తిగా మానేయాలి. ఇవన్నీ పాటిస్తూ యోగా, మెడిటేషన్‌ వంటివి పాటించడం వల్ల రక్తపోటు కంట్రోల్‌ అవ్వడంతో పాటు గుండె సమస్యలు దూరమవుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే
కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే
హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం
హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం
తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..
8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..
ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్
ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌ 13వ రోజు హైలెట్స్
అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు
అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు
రైలులో ఏసీ పనిచేయలేడం లేదని చైన్ లాగిన ప్యాసింజర్.. కట్‌చేస్తే
రైలులో ఏసీ పనిచేయలేడం లేదని చైన్ లాగిన ప్యాసింజర్.. కట్‌చేస్తే
శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..
శరీరంలో ఈ లక్షణాలున్నాయా? విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్లే..
సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొంటున్నారా? లాభ నష్టాలు ఏంటో తెలుసా?
సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొంటున్నారా? లాభ నష్టాలు ఏంటో తెలుసా?
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.