Heart attack: నెలరోజుల ముందు కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సూచనలు
ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధిత వ్యాధులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే గుండెపోటుతో మరణిస్తుండడం అందరినీ విస్మయానికి...
ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధిత వ్యాధులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే గుండెపోటుతో మరణిస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అయితే హృదయ సంబంధిత వ్యాధులను సకాలంలో గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే నెల రోజుల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే దవడ నొప్పి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో దవడ నొప్పి భరించలేని స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
* మెడ నొప్పి కూడా గుండెపోటు ప్రారంభ లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నపలంగా ఒక్కసారిగా మెడలో విపరీతమైన నొప్పి కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. మెడనొప్పి తరచుగా వస్తే సాధారణం కాదని గుర్తించాలి.
* గుండె పోటుకు భుజం నొప్పి కూడా ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా భుజంలో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
* కొన్ని సందర్భాల్లో వెన్నునొప్పి కూడా గుండెపోటుకు ప్రాథమిక లక్షణమని నిపుణులు అంటున్నారు. గుండెపోటుకు చాలా రోజుల ముందు వెన్నునొప్పి వస్తుంది.
* గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు నుంచి ఛాతిలో నొప్పి మొదలవుతుంది. అసిడిటీ వంటి సమస్య లేకుండా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..