Lifestyle: ఈ ప్రాంతాల్లో నొప్పిగా ఉంటుందా.? కొలెస్ట్రాల్ పెరిగి ఉండొచ్చు..
అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. అయితే శరీరంలో కనిపించే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో మూడు అవయవాల్లో...

అధిక కొలెస్ట్రాల్ శరీరానికి ఎంతో హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకా వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ కారణమవుతుంది. ముఖ్యంగా అధికరక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలకు శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వే కారణం. శరీరంలో పెరిగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతుంటారు.
అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. అయితే శరీరంలో కనిపించే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో మూడు అవయవాల్లో నొప్పిగా ఉంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పడానికి ముందస్తు లక్షణాలుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే తొడలు, తుంటి, కాళ్ల కండరాల్లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది తిమ్మిరికి కారణమవుతుంది. ధమనుల్లో కొవ్వు అడ్డు పడటం వల్ల రక్తం గుండెకు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా ప్రయాణించడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యంగా కాళ్లలో, రక్తం సరిగ్గా ప్రవహించదు. ఈ అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల నొప్పి వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు.
పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పై తెలిపిన ప్రాంతాల్లో నొప్పి రావడంతో పాటు నడవడంలో ఇబ్బందిగా ఉన్నా, మెట్లు ఎక్కలేక పోతున్నా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవాలి. ఇందుకోసం వైద్యుల సూచన మేరకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయిచుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పాదాలతో పాటు అరికాళ్లలో తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. పాదాల్లో తిమ్మిరి సమస్య వేధిస్తుంది. పాదాలు చల్లగా మారుతాయి. కాలి గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. కాళ్లలో వాపు కనిపిస్తుంది. పాదాల చర్మం రంగులో మార్పు కనిపించినా కొలెస్ట్రాల్ పెరిగినట్లు భావించాలి.
నోట్: పై తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..