Lifestyle: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. క్యాన్సర్ కావొచ్చు
శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా క్యాన్సర్‌ను త్వరగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ట్రీట్‌మెంట్ విధానాల ద్వారా క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే పూర్తిగా నయం చేయొచ్చు. ఇంతకీ క్యాన్సర్‌ను తొలుత ఎలా గుర్తించాలి.? ఎలాంటి లక్షణాలు క్యాన్సర్‌కు ముందస్తు సూచికలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ వ్యాధి ఒకటి. ఈ మాయదారి రోగం ఎంతో మందిని రోజూ మింగేస్తోంది. రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ సహాయంతో క్యాన్సర్ బారిన పడిన వారు కూడా కోలుకుంటున్నారు. మళ్లీ ఎప్పటిలా జీవనం సాగిస్తున్నారు. అందుకే క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా క్యాన్సర్‌ను త్వరగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ట్రీట్‌మెంట్ విధానాల ద్వారా క్యాన్సర్‌ను తొలినాళ్లలోనే పూర్తిగా నయం చేయొచ్చు. ఇంతకీ క్యాన్సర్‌ను తొలుత ఎలా గుర్తించాలి.? ఎలాంటి లక్షణాలు క్యాన్సర్‌కు ముందస్తు సూచికలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎలాంటి పనిచేయకపోయినా నిత్యం నీరసంగా, అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి లక్షణాలు పెద్ద పేగు క్యాన్సర్, లుకేమియా క్యాన్సర్‌లకు ముందస్తు లక్షణాలుగా చెబుతుంటారు.
* ఒక ఎలాంటి కారణం లేకుండా ఒకేచోట ఉన్నపలంగా నొప్పి పెరిగినా.. ఎంత చికిత్స చేయించకున్న నొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి ఇది కూడా క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణం కావొచ్చు.
* శరీరంలో ఉన్నపలంగా ఎక్కడైనా వాపు కనిపించినా, గడ్డలు లాంటివి అసహజంగా కనిపించినా అవి క్యాన్సర్‌కు సంబంధించినవి కావొచ్చని అనుమానించాలి. వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
* ఇక తరచూ చర్మం ఎర్రబడుతున్నా, చర్మంపై చిన్న చిన్న మచ్చలు, స్పర్శలేని మొటిమలు లాంటివి కనిపిస్తున్నా వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఇవి చర్మ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణాలు భావించాలి.
* దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతున్నా, ఉన్నట్లుండి బరువు తగ్గుతున్నా, జీర్ణ సంబంధిత సమస్యలు వెంటాడుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకుంటే అసలు విషయం తెలుస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..