AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్లు దాటాక.. ఈ 5 మార్పులు మీ జీవితానికి గొప్ప మలుపు..! అవి ఏంటో తెలుసుకోండి..

మీరు 30 ఏళ్లు దాటినవారైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి. ఈ సమయంలో మీ జీవనశైలి కొద్దిగా మారినప్పటికీ

30 ఏళ్లు దాటాక.. ఈ 5 మార్పులు మీ జీవితానికి గొప్ప మలుపు..! అవి ఏంటో తెలుసుకోండి..
30 Years
uppula Raju
| Edited By: |

Updated on: Aug 10, 2021 | 4:23 PM

Share

మీరు 30 ఏళ్లు దాటినవారైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి. ఈ సమయంలో మీ జీవనశైలి కొద్దిగా మారినప్పటికీ సంతోషంగా ఉంటారు. అయితే 60 నుంచి 70 ఏళ్ల వయసులో మీరు సౌకర్యవంతంగా జీవించాలంటే కొన్ని మార్పులు చేయడం అవసరం. లేదంటే కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ 5 విషయాలపై కచ్చితంగా దృష్టి సారించండి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1) జీవనశైలి మెరుగుపరుచుకోండి మీకు ధూమపానం అలవాటు ఉంటే ముందుగా దాన్ని వదిలేయండి. ధూమపానం మీ ఎముక సాంద్రత, రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. బిస్కెట్లు, కేకులు, చిప్స్, కోలా వంటి జంక్ ఫుడ్ వల్ల బరువు పెరుగుతారు. అందువల్ల వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అంతేకాకు వృథా ఖర్చు.

2) గుడ్ రిలేషన్ షిప్ 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ లభిస్తుంది. కౌమారదశలో ఉన్న వ్యక్తులతో మీకు గొడవలు ఉంటే వెళ్లి వారితో మాట్లాడండి. మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోండి. మనసు ఉల్లాసంగా ఉంటే మీకు సంతోషకరమైన జీవితం ఉంటుంది. అనవసరమైన గొడవలకు స్వస్తి చెప్పండి. ఇది సాధ్యపడాలంటే సంబంధాల నిర్వహణ చాలా ముఖ్యం.

3) శారీరక శ్రమ కూర్చొని పని చేసే వారైతే ప్రతిరోజూ కొద్దిగా వ్యాయామం చేయడం ప్రారంభించండి. శరీర బరువును అదుపులో ఉంచుకోండి. మీ శరీరాన్ని రిపేర్ చేయడానికి ఇది ఉత్తమ వయస్సు. మీరు ఊబకాయాన్ని నియంత్రించకపోతే ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా-ప్రాణాయామం, ధ్యానం చేస్తే మంచిది.

4. డబ్బు ఆదా 30 సంవత్సరాలలో మీకు సమయానికి ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా తదితర పాలసీలపై దృష్టి సారించాలి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఆదాయానికి మంచి వనరుగా చెప్పవచ్చు. వీటి గురించి కచ్చితంగా ఆలోచించాలి.

5. శరీరానికి విశ్రాంతి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి నిద్ర పోవడం చాలా ముఖ్యం. లేదంటే మీ శరీరాన్ని దోపిడీ చేసినట్లే. సరైన నిద్ర వల్ల మీ శరీరం, మనస్సు పునరుద్ధరించబడతాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ కనీసం 6 గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిది. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Srinagar Grenade Attack: శ్రీనగర్ లాల్‌చౌక్ వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి.. ఐదుగురు పౌరులకు తీవ్ర గాయాలు..!

Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్

Non Corona Patients: నాన్ కరోనా వ్యాధుల బాధితులకు లాక్‌డౌన్ సమయంలో అందని వైద్యసహాయం.. ఐసీఎంఆర్ నివేదిక!