Weight Loss: బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నారా.? అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త!

బరువును తగ్గించే క్రమంలో చాలామంది డైటింగ్ అనే పేరుతో ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. ఇలా చేయడం..

Weight Loss: బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నారా.? అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త!
Weight Loss Tips
Follow us

|

Updated on: Aug 10, 2021 | 2:38 PM

బరువును తగ్గించే క్రమంలో చాలామంది డైటింగ్ అనే పేరుతో ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం అటుంచితే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. సమతుల్యంలో ఆహారాన్ని తీసుకోకపోవడం కారణంగా పోషకాలు తగ్గి వ్యాధుల బారిన పడొచ్చునని చెబుతున్నారు. కొవ్వును తగ్గించాలనుకుంటున్నవారు అటు వ్యాయామం.. ఇటూ ఆహారం రెండూ సమత్యులంగా ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆకలితో ఉండటం అడపాదడపా ఉపవాసంతో సమానమని బరువు తగ్గాలని భావించే వ్యక్తుల్లో ఉన్న ఓ అపోహ. అడపాదడపా ఉపవాసం కంటే ఆకలితో ఉండటమే ఇబ్బంది అని డాక్టర్లు అంటున్నారు. తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాలరీల కొరత ఏర్పడుతుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావితం పడుతుంది.

జీవక్రియను నెమ్మదిస్తుంది…

మీరు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నుండి శక్తి ఉత్పత్తి అవ్వడం ప్రారంభమై జీవక్రియ రేటు నెమ్మదిస్తుంది. దీని వల్ల బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది.

అలసిపోవడం…

పోషకాల కొరత అలసటకు కారణమవుతుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్నా కూడా మీకు అలసట తగ్గకపోవచ్చు. దీని కారణంగా, వ్యాయామం చేసేటప్పుడు మీకు ఒళ్లు నొప్పులు ఏర్పడవచ్చు. లేదా వ్యాయామం చేసే శక్తి కూడా ఉండకపోవచ్చు.

మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది…

ఆహారం మనల్ని శారీరికంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. పోషకమైన ఆహారం లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇందువల్ల ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Also Read:

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

బైక్ డూమ్ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూస్తే షాక్.. నెట్టింట వైరల్!