Flu Vaccine: సాధారణ ఫ్లూ వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుంది..పరిశోధనల్లో వెల్లడి!
ఫ్లూ వ్యాక్సిన్ కరోనా సంక్రమణ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఇది మాత్రమే కాదు, దీనితో పాటు ఇది స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం, సెప్సిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Flu Vaccine: ఫ్లూ వ్యాక్సిన్ కరోనా సంక్రమణ వ్యాప్తిని నిరోధించవచ్చు. ఇది మాత్రమే కాదు, దీనితో పాటు ఇది స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం, సెప్సిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. యుఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మయామి మిల్లర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ వాదన చేశారు. శాస్త్రవేత్తలు, పరిశోధన సమయంలో, ఫ్లూ అనగా ఇన్ఫ్లుఎంజాకు టీకాలు వేసిన వ్యక్తులు, అత్యవసర పరిస్థితిలో చేరే ప్రమాదం కరోనా కారణంగా ఐసీయూలో చేరే ప్రమాదం తగ్గినట్లు తాజాగా తెరపైకి వచ్చింది.
చాలాదేశాల్లో జరిగిన పరిశీలన..
పరిశోధన సమయంలో, అనేక పెద్ద దేశాలలో రోగుల రికార్డులు తనిఖీ చేశారు. వీరిలో యుఎస్, యుకె, జర్మనీ, ఇటలీ, ఇజ్రాయిల్, సింగపూర్ రోగులు ఉన్నారు. పరిశోధకులు 7 కోట్ల మందిలో 37,377 మంది రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని రోగులకు కరోనా సోకిన తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చారు. అదే సమయంలో, ఈ టీకా మోతాదు తీసుకోని రెండవ గ్రూపులో కోవిడ్ రోగులూ ఉన్నారు.
ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోని వారు 20 శాతం వరకు ఐసీయూలో చేరే అవకాశం ఉందని ఫలితాలు చూపించాయి. ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యే వారి ప్రమాదం 58 శాతం, సెప్సిస్ ప్రమాదం 45 శాతం మందిలో, స్ట్రోక్ ప్రమాదం 58 శాతం వరకు వీరిలో కనిపించింది. ఇక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అతి తక్కువమందికి మాత్రమే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించింది. అదేవిధంగా వీరిలో తక్కువ శాతం మంది మాత్రమే ఇతర ప్రమాదకర ఇబ్బందుల బారిన పడ్డారు.
ఈ పరిశోధనల్లో పాల్గొన్న మిల్లర్ స్కూల్ ప్రొఫెసర్ దేవీందర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. మిగిలిన వారిలో ఈ వ్యాధి వ్యాప్తిని.. దీనివలన వచ్చే ఇతర ఇబ్బందులనూ తగ్గించాల్సి ఉంది. ఇందుకోసం ఫ్లూ వ్యాక్సిన్ సహాయపడుతుందని వెల్లడైంది. దీనివలన కరోనా రాకుండా ఆపలేకపోయినా.. వ్యాప్తిని ఆపగలిగే అవకాశాలున్నాయి అని చెప్పారు.
మరో పరిశోధకుడు బెంజమిన్ స్లెవిన్ మాట్లాడుతూ, మా టీమ్ మొత్తం ఫ్లూ వ్యాక్సిన్.. కరోనా మధ్య సంబంధాన్ని కనుగొనడంలోనూ, కోవిడ్ రోగుల సంఖ్యను తగ్గించడంలో నిమగ్నమై ఉందని చెప్పారు. ఇంకా ఈ పరిశోధనల గురించి పరిశోధకులు మాట్లాడుతూ, చెడు పరిస్థితులను నివారించడానికి ఎంతమంది కరోనా రోగులకు ఫ్లూ వ్యాక్సిన్ అవసరమో తెలుసుకోవడానికి మేము ప్రయత్నించాము. ఈ బృందం అలాంటి 176 మంది రోగులను వేరు చేసింది. ఈ రోగులకు కోవిడ్ తరువాత 120 రోజుల్లో ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీనివలన మంచి ఫలితాలు కనిపించాయి. కానీ, ఈ వ్యాక్సిన్ కరోనాతో వచ్చే మరణ ప్రమాదాన్ని ఎంతవరకు తగ్గిస్తుందో తెలియదు. అని చెప్పారు.
Covaxin: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్