AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Non Corona Patients: నాన్ కరోనా వ్యాధుల బాధితులకు లాక్‌డౌన్ సమయంలో అందని వైద్యసహాయం.. ఐసీఎంఆర్ నివేదిక!

కరోనా మహమ్మారి తెచ్చిన తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. ఒక పక్క ఆ మహమ్మారి విజృంభిస్తుంటే..దానిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ తప్ప మరోమార్గం ప్రభుత్వాలకు కనిపించలేదు.

Non Corona Patients: నాన్ కరోనా వ్యాధుల బాధితులకు లాక్‌డౌన్ సమయంలో అందని వైద్యసహాయం.. ఐసీఎంఆర్ నివేదిక!
Non Corona Patients
KVD Varma
|

Updated on: Aug 10, 2021 | 3:33 PM

Share

Non Corona Patients: కరోనా మహమ్మారి తెచ్చిన తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. ఒక పక్క ఆ మహమ్మారి విజృంభిస్తుంటే..దానిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ తప్ప మరోమార్గం ప్రభుత్వాలకు కనిపించలేదు. ఇబ్బంది అయినా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. కరోనా మహమ్మారి సోకడంతో ఎంత బాధలు పడ్డారో..అదే స్థాయిలో లాక్‌డౌన్ వలన కూడా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఆర్ధికంగా వచ్చిన ఇక్కట్లకు తోడు.. ఆరోగ్యపరంగా వచ్చిన బాధలు కూడా జతకలిసాయి. కరోనా లేకపోయినా.. ఇతర వ్యాధులతో బాధపడే వారు కోవిడ్ లాక్‌డౌన్  సందర్భంగా వైద్యసహాయం విషయంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తన నివేదికలో పేర్కొంది.  ఐసీఎంఆర్  కొత్త అధ్యయనం ప్రకారం, లాక్‌డౌన్ కారణంగా కోవిడ్ కాకుండా ఇతర ఇబ్బందులతో ఉన్న రోగులలో మూడింట రెండు వంతుల మంది సాధారణ తనిఖీలు.. హాస్పిటల్ సందర్శనలలో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.

అధ్యయనంలో  69% నాన్-కోవిడ్ రోగులకు సాధారణ పరీక్షలు జరిగినట్లు వెల్లడైంది.  67% మందికి డే-కేర్ విధానాలు ఉన్నాయి. ఇదే సమయంలో వీరిలో  61% మంది ఆసుపత్రికి చేరుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అలాగే, 59% మందికి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఆలస్యం అయింది. 56% మంది అత్యవసర చికిత్సల కోసం, 47% మంది మందుల కోసం, 46% మంది ఆరోగ్య సంరక్షణ వంటి సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. దీర్ఘకాలిక అంటువ్యాధులు లేని వ్యక్తులు ఈ కాలంలో చాలా ఎక్కువగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఐసీఎంఆర్ తెలిపింది.

దేశంలో కరోనా మహమ్మారి  మొదటి వేవ్ సమయంలో, 25 మార్చి 2020 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. మొదటి లాక్‌డౌన్ 21 రోజులు విధించగా, తరువాత దానిని మరో 19 రోజులు పొడిగించారు. దీని మొదటి దశ మార్చి 25 నుండి ఏప్రిల్ 14 వరకు అదేవిధంగా, రెండవ దశ 15 ఏప్రిల్ నుండి మే 3 వరకు కొనసాగింది.  దీని తరువాత కూడా, లాక్‌డౌన్ వివిధ దశలలో కొన్ని రాయితీలతో అమలులో ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ లాంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ పరిస్థితిలో మొదటి వేవ్ సమయం కంటే రెండో వేవ్ సమయంలో కొంతవరకూ పరిస్థితులు మెరుగుపడ్డాయని ఐసీఎంఆర్ చెప్పింది.

ప్రస్తుతం దేశంలో కరోనా మూడవ వేవ్ భయం పెరిగింది. మహమ్మారి రెండవ దశ గరిష్ట స్థాయిని అధిగమించింది. మూడవ వేవ్  వస్తుందనే భయాలు ఇంకా వీడలేదు.  గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 36,028 కొత్త రోగులు కనుగొనబడ్డారు. 39,828 మంది కోలుకున్నారు మరియు 447 మంది సోకినవారు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదు అవుతున్న  రోగుల కంటే ఎక్కువ మంది రోగులు వరుసగా మూడోరోజు కూడా కరోనాను జయించారు. ఇది ఒకవిధంగా మంచి సంకేతంగా భావించవచ్చు.

కొత్త రోగుల సంఖ్య, గత 14 రోజుల్లో అత్యల్పంగా

కొత్త రోగుల సంఖ్య కూడా గత 14 రోజుల్లో కనిష్టంగా ఉండటం కూడా ఉపశమనం కలిగించే విషయం. ఇంతకుముందు జూలై 26 న, 30,820 మంది కరోనా నివేదిక పాజిటివ్‌గా వచ్చింది. కేరళలో కూడా కేసులు తగ్గాయి. ఇక్కడ ఆదివారం, 18,607 మంది రోగుల కరోనా నివేదిక పాజిటివ్‌గా వచ్చింది. 20,108 మంది కోలుకున్నారు. 93 మంది మరణించారు. దీనికి ఒక రోజు ముందు, 20,367 కేసులు ఇక్కడ వచ్చాయి.

Also Read: Covaxin: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుజ‌రాత్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్

Canada – India: భారత్‌ విమానాలపై ఆంక్షల కొనసాగింపు.. నిషేధాన్ని పొడిగిస్తూ ప్రకటన చేసిన కెనడా.