International Carrot Day: క్యారెట్‌‌ గురించి మీకు తెలియని రహస్యాలు ఇవే!

క్యారెట్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. క్యారెట్‌లో ఎన్నో రకాలు, జాతులు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఆరెంజ్‌ కలర్‌లో లభ్యమయ్యే క్యారెట్లనే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు ఇంటర్నేషనల్ క్యారెట్‌ డే సందర్భంగా.. క్యారెట్ గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. 2003 నుంచి ఇంటర్నేషనల్ క్యారెట్ డేని..

International Carrot Day: క్యారెట్‌‌ గురించి మీకు తెలియని రహస్యాలు ఇవే!
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీపి రుచిగల పండ్లకు దూరంగా ఉండాలి. కానీ పిల్లల ఆహారంలో క్యారెట్లు చేర్చవచ్చు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ క్యారెట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. క్యారెట్లలో పిండి పదార్ధాలు ఉండవు. కాబట్టి దీనిని తినవచ్చు.
Follow us

|

Updated on: Apr 03, 2024 | 3:44 PM

క్యారెట్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. క్యారెట్‌లో ఎన్నో రకాలు, జాతులు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువగా ఆరెంజ్‌ కలర్‌లో లభ్యమయ్యే క్యారెట్లనే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు ఇంటర్నేషనల్ క్యారెట్‌ డే సందర్భంగా.. క్యారెట్ గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. 2003 నుంచి ఇంటర్నేషనల్ క్యారెట్ డేని నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా కంటి చూపు అనేది మెరుగు పడుతుంది. క్యారెట్స్ తినడం వల్ల శరీరంలో జరిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

ప్రతి రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. క్యారెట్లో‌ ఉండే విటమిన్ బి6, విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి రెండూ ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సోకకుండా కాపాడతాయి. దీంతో త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

జ్ఞాపక శక్తిని పెంచుతాయి:

క్యారెట్ తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. క్యారెట్‌లో ఉండే ఫోలేట్, పొటాషియం.. అభిజ్ఞా పని తీరును మెరుగు పరుస్తాయి. దీంతో మెదడు అనేది యాక్టీవ్‌గా మారుతుంది. మతి మరపు అనేది దూరం అవుతుంది. అదే విధంగా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. చిన్న పిల్లలకు ప్రతి రోజూ ఇస్తే.. వారిలో జ్ఞాపక శక్తి అనేది మెరుగు పడుతుంది.

ఇవి కూడా చదవండి

నోటి దుర్వాసన పోతుంది:

శ్వాస సంబంధిత సమస్యలతో పోరాటడానికి కూడా క్యారెట్ ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా క్యారెట్ తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అలాగే నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. చిగుళ్ల వ్యాధి, దంతక్షయం వంటివి రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ రాకుండా చేస్తుంది:

తరచూ క్యారెట్ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తుంది. క్యారెట్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్