- Telugu News Photo Gallery Get rid of dark spots on elbows with these tips, check here is details in Telugu
Beauty Tips: మోచేతులు నల్లగా ఉన్నాయా.. ఇలా చేశారంటే తెల్లగా మారతాయి!
మొటిమలు, మచ్చలు లేని చర్మం ఉండాలని అనుకోని వారుండరు. ఇలా క్లియర్ స్కిన్ ఉండాలంటే.. అందుకు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. స్కిన్‌కి సంబంధించి ఇప్పటికో ఎన్నో బ్యూటీ టిప్స్ తెలుసుకున్నాం. చాలా మందికి మోచేతులు చాలా నల్లగా ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మోచేతులను శుభ్రం చేసినా కూడా నల్లగానే ఉంటాయి. ఈ మోచేతుల నలుపు పోగెట్టేందుకు ఇప్పుడు మంచి చిట్కాలు..
Updated on: Apr 03, 2024 | 4:03 PM

మొటిమలు, మచ్చలు లేని చర్మం ఉండాలని అనుకోని వారుండరు. ఇలా క్లియర్ స్కిన్ ఉండాలంటే.. అందుకు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. స్కిన్‌కి సంబంధించి ఇప్పటికో ఎన్నో బ్యూటీ టిప్స్ తెలుసుకున్నాం.

చాలా మందికి మోచేతులు చాలా నల్లగా ఉంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మోచేతులను శుభ్రం చేసినా కూడా నల్లగానే ఉంటాయి. ఈ మోచేతుల నలుపు పోగెట్టేందుకు ఇప్పుడు మంచి చిట్కాలు తెలుసుకోబోతున్నాం. మరి ఏం చేయోలో చూసేయండి.

నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్.. చర్మంపై ఉండే నలుపును పోగొడుతుంది. నిమ్మ చెక్కను తీసుకుని తరచూ మోచేతులపై రుద్దుతూ ఉంటే క్రమంగా నలుపు అనేది తగ్గుతుంది.

తరచూ పాల మీద మీగడతో కూడా మోచేతులపై ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు. మీగడతో మోచేతులపై మసాజ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గడమే కాకుండా.. సాఫ్ట్‌గా ఉంటుంది.

శనగ పిండితో కూడా నలుపును పోగొట్టవచ్చు. శనగ పిండిలో పాలు లేదా నిమ్మకాయ రసం వేసి మోచేతులపై తరచూ రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే నలుపు అనేది క్రమంగా తగ్గుతుంది. సింపుల్ చిట్కాలే అయినా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి.




