10 Minutes Workout: ఐదు వ్యాయామాలతో రోజుకు పది నిమిషాల వర్క్‌అవుట్.. నాజూకైన శరీరం మీ సొంతం..
ముఖ్యంగా వ్యాయామం చేయడానికి సమయం లేదంటూ చాలా మంది తప్పించుకుంటున్నారు. అయితే నిపుణులు మాత్రం ప్రస్తుతం ఉరుకులపరుగుల జీవితంలో కేవలం పది నిమిషాల వ్యాయామం చేసినా సరిపోతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే నాజూకైన శరీరంలో మీ సొంతం అవుతుందని పేర్కొంటున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలా మంది జిమ్స్‌కు వెళ్లకుండానే ఇంటి వద్దే వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి భయం తగ్గడం.. సాధారణ జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో మళ్లీ మామూలు స్థితికి చేరాడు. దీంతో మళ్లీ వ్యాయామం చేయడం చాలా మంది ఆపేశారు. ముఖ్యంగా వ్యాయామం చేయడానికి సమయం లేదంటూ చాలా మంది తప్పించుకుంటున్నారు. అయితే నిపుణులు మాత్రం ప్రస్తుతం ఉరుకులపరుగుల జీవితంలో కేవలం పది నిమిషాల వ్యాయామం చేసినా సరిపోతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాయామాలు చేస్తే నాజూకైన శరీరంలో మీ సొంతం అవుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఊబకాయం సమస్యను అదుపులోకి ఉంచుకోవడానికి కచ్చితంగా వ్యాయామం ఒక్కటే ప్రధాన మార్గం అని సూచిస్తున్నారు. నిపుణులు సూచించే ఆ ఐదు సులభమైన వ్యాయామాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
జంపింగ్ జాక్స్
జంపింగ్ జాక్స్ వ్యాయామం ఎలాంటి పరికరాలు లేకుండా ఎక్కడైనా చేసే ఓ సులభమైన వ్యాయామం. ఈ వ్యాయామం కార్డియోవాస్కులర్ ఓర్పును మెరుగుపరచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, అలాగే అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా మీ పాదాలను ఒకదానికొకటి, అలాగే చేతులను మీ వైపుగా ఉంచి నిటారుగా నిలబడి ప్రారంభించాలి. మీ తలపై మీ చేతులను పైకి లేపుతూ మీ కాళ్లను వెడల్పుగా చాపాలి. మళ్లీ ఎగిరి ప్రారంభ స్థానానికి వెళ్లాలి. ఇలా స్పీడ్‌గా ఓ నిమిషం పాటు చేసి, 15 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇలలా ఓ మూడుసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
స్క్వాట్స్
స్క్వాట్‌లు అంటే తక్కువ సమయంలో చేయగలిగే అద్భుతమైన వ్యాయామం. ఈ వ్యాయామం మీ కాళ్లు, తుంటి, గ్లూట్‌లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా మీ పాదాలను భుజం-వెడల్పు వేరుగా ఉంచి, మీ కాలి వేళ్లను కొద్దిగా బయటికి చూపించి నిలబడాలి. అనంతరం మీరు కుర్చీలో కూర్చున్నట్లుగా మీ మోకాళ్ళను నెమ్మదిగా వంచి, మీ తుంటిని తగ్గించాలి. అలాగే మీ వీపును నిటారుగా ఉంచండి. దీంతో పాటు మీ మోకాలు మీ కాలి వేళ్లకు మించి విస్తరించకుండా చూసుకోవాలి. తిరిగి పైకి లేచి ఒక నిమిషం పాటు పునరావృతం చేయాలి. తర్వాత ఓ 15 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుని, రోజుకు మూడుసార్లు చేయడం ఉత్తమం.
పుషప్స్
పుషప్స్ అనేది ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్, కోర్ కండరాలను లక్ష్యంగా చేసుకునే గొప్ప వ్యాయామం. ఎగువ శరీర బలాన్ని నిర్మించడంతో పాటు శరీర భంగిమ కూడా పుషప్స్ చేయడం వల్ల మెరుగుపడుతుంది. పుషప్‌లను చేయడానికి ముందుంగా మీ చేతులను భుజం వెడల్పుతో నేలపై ఉంచాలి. అలాగే పాదాలను మీ వెనుక ఉంచాలి. మీ మోచేతులను వంచి, మీ వీపును నిటారుగా ఉంచి, మీ శరీరాన్ని నేల వైపునకు తగ్గించాలి. మీ శరీరాన్ని తిరిగి ప్రారంభ స్థానానికి పుష్ చేస్తే సరి. ఇలా ఒక నిమిషం పాటు పునరావృతం చేసి మళ్లీ 15 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
ప్లాంక్స్
ప్లాంక్స్ అనేది అబ్స్, బ్యాక్, భుజాలతో సహా కోర్ కండరాలను లక్ష్యంగా చేసుకునే ఒక ప్రసిద్ధ వ్యాయామం. ప్లాంక్ చేయడానికి మీ ముంజేతులను నేలపై ఉంచి, మీ మోచేతులను నేరుగా మీ భుజాల క్రింద అమర్చడం ద్వారా ప్రారంభించాలి. అనంతరం మీ కాళ్ళను మీ వెనుకకు విస్తరించి, మీ శరీరాన్ని నిటారుగా ఉంచాలి. ఇలా ఒక నిమిషం పాటు చేసి మళ్లీ 15 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి.
బర్పీస్
బర్పీస్ వ్యాయామం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఛాతీ, చేతులు, కాళ్లు, కోర్ కండరాలతో సహా బహుళ కండరాల సమూహాలను లక్ష్యంగా చేసుకునేలా ఈ వ్యాయామం ఉంటుంది. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా మీ పాదాలను భుజం వెడల్పుతో నిటారుగా ఉంచాలి. తర్వాత మీ మోకాళ్ళను వంచి మీ చేతులను మీ ముందు నేలపై ఉంచాలి. మీ పాదాలతో వెనుకకు దూకి పుషప్ స్థితికి చేరుకోవాలి. ఇలా మీకు వీలైనంత ఎత్తుకు దూకాలి. ఈ వ్యాయమం కూడా స్పీడ్‌గా ఒక నిమిషం పాటు చేసి 15 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..