ప్రపంచంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణించే విమానం.. నేను ఫ్లైట్ ఎక్కాను అని చెప్పేలోపుగానే ప్రయాణం పూర్తి..
ప్రజలు ఎక్కువగా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లేందుకు విమాన ప్రయాణం చేస్తుంటారు. లేదంటే, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు కూడా ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటారు. అలాంటిది అతి తక్కువ సమయం విమానంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి. విమానం ఎక్కిన 47 సెకన్ల సమయంలోనే మీరు గమ్యాన్ని చేరుకుంటారు..